నేలజేరి ముద్దునివ్వ క్రిందకొంగి
కాలుజారి జల్లులాగ కిందపడ్డ వాడు ఇపుడు
నల్ల రంగు చెంగులోకి దూరి గమ్మునున్నాడు
కొంత తడవులోనే తనని వీడిపోవు రేడుచూసి
విర్హబాధ రగిలిపోగ పొగలు గక్కి కరిగిపోతు
నల్ల కోక క్రిందనున్న రంగులన్ని తిరిగి ఇచ్సునామే
అతని గాలి తగల గానె పరవశించిపోయి
ఇలన ఉన్న రంగులన్ని ఒంటికద్దుకుని
గుండెనిండ ప్రేమ నింపి గుప్పు మంది లోకమంత
This comment has been removed by the author.
ReplyDeleteక్రిందికొంగి ముద్దునివ్వ కోరుచున్న
ReplyDeleteప్రియుడాతడు చినుకులా జారి ప్రేమ జల్లులే
కురిపించు నల్లని వాడు, నింగి లో దోబూచులాడు
నా నాధుడు మేఘుడే ఇతడు
చిరు గాలి చల్లగా మోసుకొచ్చింది
మెల్లగా చెవిలో ఊసులాడింది
తానొస్తున్నాడన్న సంబరంలో
రంగుల హరివిల్లయింది నా మనసు
మదిలో దాగిన ప్రతి జ్ఞాపకం
ఒక పూవయ్యింది తన దారిలో
ఎదలోని నా ఊహలన్ని
పచ్చని చిగురు తొడిగాయి తనకోసం
ప్రకృతిని నేను నా పురుషుడి కోసం
పులకింతల కొత్తరంగులద్దినాను
నా స్వామికోసం నిలువెల్లా
నును సిగ్గుల మొగ్గలతో వేచి ఉన్నాను
(వర్ష ధారతో తడిసిన పుడమి కదా)
chaalaa baagaa raasaaru iddaru
ReplyDeleteరెండూ భలేగా ఉన్నాయే.
ReplyDeleteశృతి గారు, మీరు రాసింది చాలా బాగుంది. కానీ పప్పులో కాలేశారు. మళ్ళి ఒక సారి ఆలోచించండి.
ReplyDeleteఅతడు => వర్షం, నల్ల రంగు చీర మేఘం, చూపిన ఆ రంగులేమో ఇంధ్రధనస్సు
ReplyDeleteఈ పొలిక సరిపోతుందా గురువు గారూ!
మొన్న రాత్రి దాకా వానపడి, రాత్రికి ఆగి, తెల్లారుఝమున పొగమంచు వీడి, తిరిగి చెట్లు పుట్టలు వాటి వాటి రంగులతో కనిపించే సరికి.. ఆ ప్రకృతి అందం ఈ విధంగా పేపరెక్కింది.
ReplyDelete'నింగి ' - రోజంతా వాన కురిసి రాత్రికి శాంతించింది
'రాత్రి ' - తెలతెల వారుతుండగా, పొగమంచు తొలిగి, లోకమంతా రంగులు రంగులుగా కనిపిస్తుంది.
'పగలు ' - తెలవారగానే, తోటలోని పూలన్నీ విచ్చుకుని, వాటి సుగంధాన్ని లోకమంతా పంచినాయి
ఆత్రేయగారు,బావుందండీ ,గురు శిష్యుల సంవాదం .
ReplyDeleteఆత్రేయ గారూ బావుందండి.శృతి గారూ మీరు గ్రేట్.ఇద్దరూ ఇద్దరే.
ReplyDeleteరాధిక గారు పరిమళం గారు ధన్యవాదాలు.
ReplyDelete