నువ్వంటే భయం
నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తావనో
నీ అస్థిత్వ రూపం అగుపడదనో
అసలున్నావో లేవనో. ఒకటే భయం
ఐనా నీకోసమే శోధన నిను కానని వేదన
నువ్వంటే భయం
నీ వికృత రూపం చూడలేమనో
నీ నీడల కరాళ నృత్యం చూసో
అసలేరూపం నీకు లేదనో. ఒకటే భయం
ఐనా నీకోసమే పోరాటం, తీరని ఆరాటం
నువ్వంటే భయం
అంది ఆత్మ సాక్షితో నిలవలేననో
తెలిసి నన్నే ద్వేషిస్తామనో
పొందక బంధం తెంపలేమనో, ఒకటే భయం
ఐనా నీకోసమే ఈ చూపులు, పడి గాపులు
నిజం నువ్వంటే భయం
అవును నిజం నువ్వంటే భయం .
నువ్వంటే ఇష్టం
ReplyDeleteకాలాన్ని సైతం నిలవేస్తావని
నువ్వంటే భయం
నన్నెక్కడ నిలదీస్తావో అని
పక్కవాడి చేతల్లో మాటల్లో
నువ్వుంటే ఇష్టం
నా ప్రక్కలో బల్లెమై
నన్నెక్కడ పొడుస్తావొ అన్న భయం
నిజం, నీరూపం తెలియదు
కాని ఎందుకో
ఇక్కడే ఇప్పుడే నిన్ను
చూశాననిపిస్తుంది. ఇది నిజం
నిన్ను చూస్తే రాని భయం, వూహల్లోని నీరూపు చూస్తే,
ReplyDeleteనింపేస్తుంది నరనరం ఏదో భయం, వాస్తవమన్న జబ్బు సోకిన రోగివనిపిస్తావని.
నా ప్రేమ లేపనంతో నయంచేసినా, నవ్వించినా, నిన్నలరించి పంపినా,
నా పేరే అడుగవనీ, నీ వూరే చెప్పవని, మళ్ళీ వస్తానంటావేమోనని నువ్వంటే భయం
వద్దనా మళ్ళీ మళ్ళీ నా లోగిలికి ప్రేమరాహిత్యంతోనే వచ్చి,
నా గుండె ఖాళీ అయ్యేంత తోడుకెళ్ళిపోతుంటావనీ నువ్వంటే భయం.
నిజం, సత్యం నిజంగానే చాలా భయంకరం
ReplyDeleteఉష, శృతి మీ స్పందనకు ధన్యవాదాలు