Thursday, November 13, 2008

తెలుగు palindrome ప్రయత్నం !!

భక్తి భావం లేక, డబ్బుకోసం ఆడంబరాలకోసం
భక్తిని నటించే స్థలానికి పోవద్దని ఒక నర్తకికి
సలహా ఇచ్చే సన్నివేశం.

(న) అజ భక్తి నొదిలి దినోక్తి భజన (అ)
ల ఏ కరవుకూ నటనకూ వురక లే ల ?
ఆ కనకరాశి నొగ్గి నో సీ రా! (ఆ ) కనక (ఆ)
కీర్తనకు పోకు నర్తకీ !!


ఇది నా మొదటి ప్రయత్నం. బ్లాగులోకంలోని పెద్దలు
చదువు తల్లి ముద్దు బిడ్డలు నా తప్పులను దిద్ద గలరు.

palindrome అంటే తెలియని వారికి:
ఈ కవితలోని ప్రతి పాదమూ, ఎటు నుంచి చదివినా ఒకటే గా ఉంటుందన్న మాట.
"కీర్తనకు పోకు నర్తకీ " -- మీరు కుడి నుండి ఎడమకు చదివినా, ఎడమ నుండి కుడి వైపుకు చదివినా
ఒకటే !! అదన్న మాట ఇక్కడ ప్రత్యేకత.


bhakti bhaavam lEka, DabbukOsam aaDambaraalakOsam
bhaktini naTincE sthalaaniki pOvaddani oka nartakiki
salahaa iccE sannivESam.

(na) aja bhakti nodili dinOkti bhajana (a)
la E karavukuu naTanakuu vuraka lE la ?
aa kanakaraaSi noggi nO sii raa! aa kanaka
keertanaku pOku nartakee !!


idi naa modaTi prayatnam. blaagulOkamlOni peddalu
caduvu talli muddu biDDalu naa tappulanu didda galaru.

9 comments:

  1. palindrome అంటే ఏంటి ??????

    ReplyDelete
  2. లలిత గారూ, palindrome అంటే ఏమిటో నా టపాలో చెప్పాను చూడండి.

    ReplyDelete
  3. అద్బుతం. పాలిండ్రోం అంటె madam i am adam
    Was it a rat I saw వంటి ఇంగ్లీషు పదాలతో తప్ప తెలుగులో వాక్యాలు చూడలేదు. వాక్యాలతో పద్యం కూడా చూడటం ఆనందంగా ఉంది.
    మొదటి లైను కొంచెం చిత్రీ పట్టాలేమో ననిపించింది.

    ReplyDelete
  4. బాబా గారు ధన్యవాదాలు
    ఇది నా మొదటి ప్రయత్నమే. నా పరిమిత తెలుగు పరగ్నానంతో, ఈ మాత్రం కూడా చేయగలను అనుకోలేదు. మీ అందరి ప్రోత్సాహంతో చేయగలను అనిపిస్తుంది.

    ReplyDelete
  5. @లలిత:

    పాలిండ్రోమ్ అంటే తిరగేసినా ఒకేలా వినిపించే మాట/వాక్యం. Liril, వికటకవి, కిటికి, race car .. ఇలాంటివన్నమాట.

    ReplyDelete
  6. manchi prayatnam. Good luck. :)
    intaki minchi memu prekshakulame gani salahaa iche staayiki inka raaledu kada :p

    ReplyDelete
  7. ఆత్రేయ గారూ, మీ బ్లాగుకి చాలా ఆలస్యంగా వచ్చానండీ :-( ఏదో శృతి గారి దయ వల్ల ఇప్పటికైనా వచ్చాను. చదువుతుంటే బుర్రతిరిగి పోతోంది. కూసింత ఈర్ష్య కూడా.....

    ReplyDelete
  8. హమ్మయ్య పిచ్చబ్బాయ్ తలతిరిగి ఇంక మంచబ్బాయివి అయ్యావన్నమాట మంచి మాట చెప్పావు. నా కవితలు మీకు నచ్చినందుకు ధన్యవాదాలండి.

    ReplyDelete