Thursday, November 13, 2008

అన్నట్టు తిరిగి రాకెపుడో ?

దగ్గరున్నా గుండె తెరిచి
ప్రేమ చూపింది లేదు గానీ
కొన్నాళ్ళకైనా నిను చూడలేనంటే
తెగిన పటం గాలికూగినట్టుంది

చెంతనున్నా గొంతు విప్పి
ఊసు చెప్పింది లేదు గానీ
కొంతకాలమైనా మాటకుదరదంటే
వీణ నుండి రాగ మూడినట్టుంది

వేరు తీరాలమని చెప్పి
నన్ను ఒప్పించుకున్నా
కొన్నిరోజులైనా ఇక కలవలేమంటే
కాలమెందుకో అసలు కదల నట్టుంది

ప్రకృతి నామీద ఈరోజు అలిగినట్టుంది


daggarunnaa gunDe terici
prEma cuupindi lEdu gaanee
konnaaLLakainaa ninu cuuDalEnanTE
tegina paTam gaalikuuginaTTundi

centanunnaa gontu vippi
uusu ceppindi lEdu gaanee
kontakaalamainaa maaTakudaradanTE
veeNa nunDi raaga muuDinaTTundi

vEru teeraalamani ceppi
nannu oppincukunnaa
konnirOjulainaa ika kalavalEmanTE
kaalamendukO asalu kadala naTTundi

prakRti naameeda eerOju aliginaTTundi
annaTTu #when r u coming back ? #

8 comments:

  1. చాలా బాగుంది కవిత

    ReplyDelete
  2. తప్పులెంచుతున్నాను అని మీరు కోప్పడనంటే ఓ మాట
    తేనెలొలుకు తెలుగు కవితలో చెర్రీ పండెందుకండీ?

    అన్నట్లు when r u coming back
    అన్నట్లు తిరిగొస్తావుగా ప్రియా అంటే ఎలా వుంటుంది

    ReplyDelete
  3. లలిత గారూ, మీ రు మళ్ళీ నాచేత నేరాసిందాన్ని మార్పించారండీ. కోప్పడటం ఎందుకండి ? అలా అనుకోకండి.

    ధన్యవాదాలు.

    ReplyDelete
  4. "when r u coming back" marchesara..:(?? intaku mundu aedo kavitalo "understandaa" ani vaadaru kada.. ala baagundi. I liked that kind of expression.
    atu amayakatwam, etu poetic ga baagundi.

    ReplyDelete
  5. changing words could be ur wish. but,not appropriate if they r ur feelings.! sorry if im wrong!!

    ReplyDelete
  6. సుజ్జి గారు

    మీ అభిమానానికి కృతజ్నతలు. "understooddaa" కవితలో ఆంగ్ల పదమ్ ఆ సందర్భానికి సరి పోయింది. కానీ ఇక్కడ లలిత గారితో ఏకీభవించి మార్చాను. నెరాశ పరిచానా? క్షమించాలి

    ReplyDelete
  7. sujji gaaru

    meeku ani pincindi meeru ceppaaru dhanyavaadaalu

    ReplyDelete
  8. చాలా బాగుంది. :)

    ReplyDelete