గుండె కొమ్మ
గతపు తేనె పట్టు
జ్ఞాపకాల గదులెన్నో
కుట్టే గాధ లెన్నో
కలత రాయి
మనసు కొలనులో
రేపే తరంగాలెన్నో
చెదిరే అంతరంగాలెన్నో
కంటి పుట్టలో
దిగులు కలుగులు
తిరిగే జీవులెన్నో
జారే ధారలెన్నో
మనసు నెగడు
మధనపు చితుకులు
ఎగిరే కీలలెన్నో
రగిలే గుండెలెన్నో
కవిత మనసు
భావ కుసుమాలు
చెప్పే మాటలెన్నో
తీరే తపనలెన్నో
gunDe komma
gatapu tEne paTTu
jnaapakaala gadulennO
kuTTE gaadha lennO
kalata raayi
manasu kolanulO
rEpE tarangaalennO
cedirE antarangaalennO
kanTi puTTalO
digulu kalugulu
tirigE jeevulennO
jaarE dhaaralennO
manasu negaDu
madhanapu citukulu
egirE keelalennO
ragilE gunDelennO
kavita manasu
bhaava kusumaalu
ceppE maaTalennO
teerE tapanalennO
మనసు పాలలో
ReplyDeleteవెన్న తీసి పారేసాను
ఈ బ్రతుకు జీవికి
అది చాలు
రాయిలా రప్పలా
మిగలడానికి
లేదంటే గుండెజబ్బులొస్తాయి
అవేజబ్బులొచ్చిపోయిన
నా వైద్యులచెంత నే చేరిపోతాను
- మనసు కవి గారు, మీ కవిత ఇంకా రోదిస్తున్న మనసుతో చదివి ఇలా వాపోయాను - ఉష
బావుంది
ReplyDeleteఇది ఒకటే కవితా?లేక కొన్ని కవితలా?
మీ కవితా భావం నన్ను చేరితే ..,
ReplyDeleteనా మదిలో జ్జాపకాల తెట్టె కదిలింది
తీపి జల్లుల తేనె కురిసింది
కలత మనసులో చిరునవ్వు నిండింది
చెప్పలేని మాటల్లో మౌనం పొంగింది
అందమైన మనసుకు ఒక ఆహ్లాదం కలిగింది.
ఉషా గారు మీరు కామెంటు చేసే తీరు నాకు చాలా నచ్చింది
ReplyDeleteలలిత గారు ధన్యవాదాలండి. ఇకపోతే మీ ప్రశ్నకు సమాధానం
ఇది ఒక కవితే నండి. నా జ్ఞాపకాల్లో ఉన్న కుట్టే గాధలని, అవి చెరిపిన అంతరంగాల్ని, కళ్ళవెంట జారే కన్నీటి ధారల్ని, రగులుతున్న గుండెను కవితలు రాసి ఎలా ఆ తపన తీర్చుకుంటున్ననో చెప్పాను
వర్మ గారు, ధన్య వాదాలండి.
ధన్యురాలను! ఐయినా మీ భావుకతముందు ఈ స్పందన యేపాటిదండి? బ్లాగు పుణ్యమా అని ఈ కూడలిలో మీరు తారసపడటం, మావంటివారితో సంభాషించటం నా భాగ్యం.
ReplyDeleteMee kavithalu kadilistunnai gundee lothu lu chupistunnai.
ReplyDelete