Sunday, December 14, 2008

అయ్యో దేవా !!

నా బ్రతుకు బావులు నిండే దాకా
ఆచి తూచి ఎంపిక చేసి
కరకు కష్టాలను నింపేశావా ? అయ్యో దేవా !!
కమలపు రేకుల బోలిన చేతులు
వాచాయేమో ! ఏవీ ముందుకు చాపు కాపడమెడతా !!

నా కన్నుల బావులు ఆరే దాకా
కాచి కాచి ఆవిరి చేసే
మంటలు గుండెలొ నింపేశవా? అయ్యో దేవా !!
దేవికి పాదాలొత్తిన చేతులు
కాలాయేమో ! ఏవీ ముందుకు చాపు వెన్నను రాస్తా !!

నా గొంతులొ నరాలు పగిలె దాకా
పిలిచి పిలిచి అలిసేలాగా
చాలా దూరం నడిచేశావా? అయ్యో దేవా !!
బ్రహ్మ కడిగిన పాదాలవ్వి
అలిశాయేమో ! ఏవీ ముందుకు చాపు ఊరటనిస్తా !!


naa bratuku baavulu ninDE daakaa
aaci tuuci empika cEsi
karaku kashTaalanu nimpESaavaa ? ayyO dEvaa !!
kamalapu rEkula bOlina cEtulu
vaacaayEmO ! Evii munduku caapu kaapaDameDataa !!

naa kannula baavulu aarE daakaa
kaaci kaaci aaviri cEsE
manTalu gunDelo nimpESavaa? ayyO dEvaa !!
dEviki paadaalottina cEtulu
kaalaayEmO ! Evii munduku caapu vennanu raastaa !!

naa gontulo naraalu pagile daakaa
pilici pilici alisElaagaa
caalaa duuram naDicESaavaa? ayyO dEvaa !!
brahma kaDigina paadaalavvi
aliSaayEmO ! Evii munduku caapu uuraTanistaa !!

3 comments:

  1. నా గుండె తలుపులు, గొళ్ళాలు వూడే దాకా
    తట్టి తట్టి బొబ్బలెక్కాయేమో నీ హస్తాలు
    ఇలా చాపు నా భక్తి నవనీతం రాస్తాను
    రేపో మాపో నాకై అభయమీయాలవి మరి!
    - కొంచం దుస్సాహసమే ఇది ఐయినా మనసున వున్నదీ చెపాలనున్నదీ - ఉష

    ReplyDelete
  2. అయ్యో ఎంత మాటన్నారు దుస్సాహసమా ? మీ మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పగలరనే నా ఆశ. కానీ నాకు ఇది కావాలి అని నాకు ఆయన అభయమీయాలన్న ఆశగానీ చూపలేదు నా కవితలో. కానీ మీ అనుసంధానమూ బాగానే వుంది. ధన్యవాదాలు.

    ReplyDelete
  3. అబ్బే మీరడిగారని కాదు సుమీ! అయినా ఆయనకి కూడ అంతా అలానే అలవాటుచేసేసారండి, మరొక్కసారి అలోచించండి - ఏమని మొక్కుకున్నావు? అని కొందరూ, కోరికలేవైనా విన్నవించుకోండని ఇంకొందరూ, ఆయనపట్ల ఆశపడే అంటురోగం పురిటిగుడ్డుకి కూడా వసలోకలిపి అంటించేస్తారు. పూజగదిలో ఆయన్ని అగరు పొగల్లో ముంచేసే ఎందరు గుండె మందిరానికి అధిపతిచేస్తారు? నాకు ఆయన్ని అలా కొలవాలంటే నూడుల్స్ లో ఆవకాయ నుంజుకున్నట్లు వుంటుంది. చూసార మీ ఒక్కమాట ఎంతపనిచేసిందో జీళ్ళపాకంలా సాగదీసాను.

    ReplyDelete