కన్నీళ్ళను తుడిచేసినా
చిరునవ్వులు పూయించినా
రహదారిన నడిపించినా
నీ కోసం కాదది నేస్తం
నీ కష్టం చూసి చెమరే కళ్ళివి
ఆ బాధను తెలిసి పగిలే ఎదయిది
నాన్న అన్నల ప్రేమల కన్నా
సడలక అల్లిన స్నేహమిది
గతమని బేలగ సద్దుకుపోకు
రుణమని చేతులు దులుపుకు పోకు
చీలికలయ్యే నీ బ్రతుకును చూస్తూ
చింతను ఒదిలి ఏల మనగల?
ఆరేదీపానికి అడ్డుగు పెట్టిన
చేతులు నెట్టుక్కు పక్కకు పోకు
స్నేహం అర్ధం తెలిసిన మనుషులు
కోటికి ఒక్కడు లేని జగతిది
మంటలొ నిన్ను ఒదిలై అంటె
వింటానని నీ కెంతటి ఆశ ?
నీ నీడను గుండెలొ నింపినవాడిని
వదిలై అంటే ఏమైపోను ?
ముత్యము వంటి నిన్ను ఒంటరిగ
పందుల ముందు ఒదలను నేస్తం
చేయిని కలిపి నాతో నడువు
కొత్త జగతికి పునాదులేద్దాం !!
శృతి గారి "వెళ్ళిపో నేస్తం " కవితకు నా స్పందన
http://manaanubhoothulu.blogspot.com/2008/12/blog-post_7433.html
kanneeLLanu tuDicEsinaa
cirunavvulu puuyincinaa
rahadaarina naDipincinaa
nee kOsam kaadadi nEstam
nee kashTam cuusi cemarE kaLLivi
aa baadhanu telisi pagilE edayidi
naanna annala prEmala kannaa
saDalaka allina snEhamidi
gatamani bElaga saddukupOku
ruNamani cEtulu dulupuku pOku
ciilikalayyE nee bratukunu cuustuu
cintanu odili Ela managala?
aarEdeepaaniki aDDugu peTTina
cEtulu neTTukku pakkaku pOku
snEham ardham telisina manushulu
kOTiki okkaDu lEni jagatidi
manTalo ninnu odilai anTe
vinTaanani nee kentaTi aaSa ?
nee neeDanu gunDelo nimpinavaaDini
vadilai anTE EmaipOnu ?
mutyamu vanTi ninnu onTariga
pandula mundu odalanu nEstam
cEyini kalipi naatO naDuvu
kotta jagatiki punaadulEddaam !!
చాలా బావుంది.
ReplyDeleteవిలపించేనేస్తాన్ని ఆదుకొని హద్దుకొని ఓదార్పునిస్తున్న మంచి మనిషి నిండు హృదయానికి అద్దం పట్టేలా కవితలో బావం గొప్పగా వున్నది.
ఒంటరితన్నాన్ని పొగొట్టే ఉత్సాహాన్ని నింపారు కవితలో.
మీకు హ్యట్సాఫ్..
మరొక కవితను కొనసాగించటం చాలా చాలా కష్టం. ఎందుకంటే ఆమూడ్, ఆ టెంపో తగ్గకుండా ఆ కవితను మోకరీ చేస్తున్నట్లు కాకుండా, దాని పక్కన పెట్టి చూసినపుడు తక్కువగా కనిపించకుండా రాయగలగటం చాలా సాహసమే.
ReplyDeleteచాలా బాగా వ్రాసారు.
అభినందనలు
పృథ్వీరాజు గారు బాబా గార్లకు ధన్యవాదాలు. శృతిగారి కవితలోని అవతలి వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఆమె తన కవితలో బాగా చెప్పారు. నేను పరకాయ ప్రవేశము చేశానంతే భావము కవితై కూర్చుంది. మీ అభిమానానికి మరొసారి ధన్యవాదాలు.
ReplyDeleteమనుషుల మధ్య బలహీన పాఅడుతున్న బంధాలు నిజంగా పుంజుకోవాల్సి ఉంది. వీటికి ఎంతో విలువనిచ్చే మీకు అభిమానిని/శిష్యుడిని కావడం నా అదృష్టంగా భావిస్తున్న.
ReplyDelete