Saturday, December 6, 2008

ఉదయం

నల్ల బుడగ గుత్తుల్లా కలలు
అలరిస్తున్నాయి, మత్తునిస్తున్నాయి

భళ్ళని పగిలిన శబ్దానికి
ఉలిక్కిపడి సూర్యుడు ఉదయించాడు

నిద్ర కన్నుల ఎరుపు తూర్పంతా పరిచాడు
భయమేసిన కోడి కేక పెట్టింది

బుజ్జాయి మెడగంట, గోపురం మీద సుప్రభాతం
ఎదురింట్లో సంగీత పాఠాలు

అలిగిన రాతిరి, నిశ్శబ్దాన్ని చీకటి సంచీలో
దాచి దాంతో ఉడాయించింది . బద్ధకం ఇక్కడొదిలేసింది

నిద్ర నాకిక రానని మొరాయించింది.

అబ్బా !! ....... అప్పుడే రాత్రెళ్ళిందా ?

nalla buDaga guttullaa kalalu
alaristunnaayi, mattunistunnaayi

bhaLLani pagilina Sabdaaniki
ulikkipaDi suuryuDu udayincaaDu

nidra kannula erupu tuurpantaa paricaaDu
bhayamEsina kODi kEka peTTindi

bujjaayi meDaganTa, gOpuramekkina
em es subbalakshmi, edurinTlO sangeeta paaThaalu

aligina raatiri niSSabdaanni ciikaTi sanciilO
daaci uDaayincindi. baddhakam ikkaDodilEsindi

nidra naakika raanani moraayincindi.

abbaa appuDE raatreLLindaa ?

7 comments:

  1. మీ శైలిలో మార్పు కొట్టొచ్చినట్టు కనపడుతుంది.:-)

    చాలా చాలా బాగుంది.
    మంచి పదచిత్రాల సౌందర్యం కవిత నిండా ఆవరించింది.

    నల్లని గుత్తుల రాత్రి కలలు భళ్ళు న పగిలాయి, సూర్యుడు ఉదయించాడు.
    రెండు పాదాల మధ్య లింకు అందంగా అమరింది.

    నిద్ర కనుల ఎరుపు తో ఆకాశం మెరిసింది.
    ఎరుపుకి భయపడిన కోడి అరచింది- నవ్యమైన అభివ్యక్తి.

    బద్దకాన్ని వదిలేసిన రాత్రి అనటంలో నిద్రలేవటానికి బద్దకంగా ఉందన్న సూచన.

    ఒక అందమైన ఉదయాన్ని అంతే అందంగా అక్షరీకరించారు.
    అభినందనలు

    ReplyDelete
  2. మరొక్క సూచన
    మీరు ఇంగ్లీషు వెర్షను ఎందుకు ఇస్తున్నారు?
    దాని అవసరత ఏమైనా ఉందా?
    తెలుసుకోవాలనుకొంటున్నాను

    ReplyDelete
  3. naadi baba gari doubtee...

    inka kavitha gurinchi.. :))

    ReplyDelete
  4. aa... 2weeks back..9daysaa ani kavitha raasaruga.. aa roju vachinatlu undi.. manchi,kotta shaili, kavitalu raastunnaru...:))

    ReplyDelete
  5. naaku telisina kondaru aaptulaki telugu cadavaTam raadu. kaanee ardham cEsukOgalaru
    vaari kOsamani pratyEkinci ilaa english lO kavitani maLLii repeat cEstaanu.

    antE kaanee marO itara niguudhaardham lEdu.


    kavita meeku naccinanduku dhanya vaadaalu.

    ReplyDelete
  6. బాబా గారు మీ విశ్లేషణ బాగుంది. ధన్యవాదాలు. తెల్లారే సరికి గుళ్ళో సుప్రభాతం లాంటివి మొదలయి పోతాయి. కానీ నా ఈ కవితలో అన్నీ రెవర్సు లాజిక్లో పని చేస్తున్నాయి. అన్దుకే తెల్లారగానే సుప్రభాతమ్ రావాల్సింది, సుప్రభాతం రాగేనే రాత్రి వెళ్ళి పోయింది. అలాగే అప్పుడే తెల్లారిందా? అన్న ప్రశ్న సాధారణంగా వేస్తాము కానీ మన బద్ధకిస్టు, అప్పుడే రాత్రేళ్ళిందా అంటున్నాడు.

    ReplyDelete
  7. ఒక్కోసారి కొన్ని కవితలు మన మనసుని తెలుపుతాయి. ఈ కవిత బ్రతుకు బాటలో సలుపుతున్న పోరు ఒక్కోసారి మీరు ఆనందిస్తున్నప్పటికి ఒక్కోసారి అలుపుని అనుభవిస్తున్న గుర్తుగా తోస్తుంది. తప్పు అనాలసిస్ అయ్యి ఊంటే క్షమించండి. చొరవ తీసుకుని ఈ విధంగా రాసినందుకు కూడా నన్ను మన్నించండి.

    ReplyDelete