Thursday, November 20, 2008

ఇంకెన్నాళ్ళు

నిర్జన నిశీధి వీధులు కూడా
సకల కళాతోరణాలు
ఆనంద జనారణ్యాలు
... నువ్వు నా తోడుంటే !
కఠిన కర్కశ కరాళ రాత్రులు కూడా
సుస్మిత దరహాసోదయ
నిరీక్షణ సోపానాలు
.. నువ్వు నా తోడుంటే !

నువ్వు లేని ఈ నిర్జన
అపరిచిత జనారణ్యంలో
కరాళ దరహాసోదయ
పరిచయాలూ కరచాలనాలు
ఇంకెన్నాళ్ళు?


nirjana niSeedhi veedhulu kuuDaa
sakala kaLaatOraNaalu
aananda janaaraNyaalu
... nuvvu naa tODunTE !
kaThina karkaSa karaaLa raatrulu kuuDaa
susmita darahaasOdaya
niriikshaNa sOpaanaalu
.. nuvvu naa tODunTE !

nuvvu lEni ee nirjana
aparicita janaaraNyamlO
karaaLa darahaasOdaya
paricayaaluu karacaanaaluu
inkennaaLLu?

3 comments:

  1. కవిత బాగుంది.
    కాక పోతేచిన్న అచ్చుతప్పు ...
    కరచాలనాలు అని ఉండాలి కదూ.

    ReplyDelete
  2. కవిత్వం చాల బాగుంది.. ధన్యవాదాలు

    ReplyDelete
  3. sai sahithi gaaru

    thank you very much for the correction. appreciate it.

    ఆనంద ధార gaaru
    thank you

    ReplyDelete