Tuesday, July 13, 2010

ప్రకృతి


ఆకు నీడన చేరిన పువ్వు
గాలి తట్టినప్పుడల్లా
తెరిపె కోసం తొంగిచూస్తూ..

నేల కురిసిన వాన
హత్తుకునే అడ్డులు...
నింపుకున్న గుంటలు..
నవ్వులు చిందిస్తూ..

నింగిలోని చుక్కలన్నీ
మెల్లగా..
గరిక కొనలమీదుగా
ఉదయిస్తూ..

ప్రతికిరణమూ
రంగులద్దుతూ..
మనసునద్దం పడుతూ..
ప్రకృతి.

పొద్దులో చూడండి http://poddu.net/?p=4833

8 comments:

  1. చాలా బాగుంది. చాలా క్లుప్తం గా మంచి భావాన్ని అందించేరు...

    ReplyDelete
  2. ఆత్రేయ గారు,

    "మనసునద్దం పడుతూ..
    ప్రకృతి."

    కవితంతా ఒక ఎత్తు..ఇదొక్కటీ ఒక ఎత్తు..నేనీ మధ్య ఇలాగనే వానమీద రాసుకున్నాను..ముగింపిది.

    "వచ్చిపోయే వాన కోసం నేల కెందుకు మక్కువ.
    తేటపడ్డ మనసు ఎక్కడుందో నాకేం తెలుసు.."

    ReplyDelete
  3. చాలా బాగుందండీ... వాన వెలిసిన అనుభూతి మిగిల్చింది...

    ReplyDelete
  4. Very nice. Pic is very beautiful.

    ReplyDelete
  5. భావన గారికి, సావిరహే గారికి, ఉష గారికి, దిలీప్ గారికి, వంశీకృష్ణ గారికి కామెంటినందుకు ధన్యవాదాలు.

    ఉష గారు మీ కవిత చూశాను చాలా బాగుంది.

    ReplyDelete
  6. చాలా బాగుంది ఆండీ

    ReplyDelete