Tuesday, June 22, 2010

పొగ మంచు.


దగ్గరయ్యేకొద్దీ
దారి చూపిస్తూ ..
మసక రూపాలకు
మెల్లగా రంగులమరుస్తూ..
మురిపిస్తూ..
తేమతగిలిస్తూ..

కంటి వెనక దారి మూసేస్తూ..
ముందు వెనకలను ఏకం చేస్తూ..

ఉదయమయ్యేదాకా
సగం రంగుల పరిధినే
ఆస్వాదించ మంటూ..

తాత మాటలు తవ్వి తీస్తూ..


పొద్దులో ప్రచురించపబడినది. http://poddu.net/?p=4744

10 comments:

  1. vivaraNa chala bagumdi, nice one

    ReplyDelete
  2. సుదీర్ఘ విరామం !
    పొగమంచు వర్ణన బావుంది.
    కానీ ఆ చివరి వాక్యం ఎందుకో అర్ధంకాలేదు గురువుగారూ ....
    (తాత మాటలు తవ్వి తీస్తూ..)

    ReplyDelete
  3. వర్మ గార్కి హను గార్కి ధన్యవాదాలు.
    పరిమళం గారూ కవిత పొగమంచు గురించి అయితే పొగమంచు చిత్రాన్నే జోడించి ఉండే వాడిని.. :-) .. ఆ "పొగమంచు " తెరలు తొలిగితే తప్ప అసలు రంగులు కనపడవు. అప్పటి దాకా వివర్ణమయిన వర్ణనే కనిపిస్తుంది.

    ReplyDelete
  4. @ATHREYA garu,

    Nenu Poddu..lo kooda palakarinhanu..

    `Sheershika`..kanipinchadam ledu..

    *PogaManchu..nu chusi andaru santoshapadataru..

    *Mimmalni chusi..Pogamanchu santoshapadutundi..

    * * *

    ReplyDelete
  5. @ATHREYA..GARU,

    "Tatha matalu..tavvi teesthuu..?

    Ane maataku.. artham cheppakunda datestunnaru

    enduko.mari?

    ReplyDelete
  6. రామ్నర్సిమ్హ గారు. పొద్దు లింకును నా కవిత క్రిందనే ఇచ్చానండి. అవును పొద్దులో పలకరించారు ధన్యవాదాలు. "నిన్న చచ్చింది, రేపు ఇంకా పుట్టలేదు, బ్రతికేది నువ్వీరోజే .. " అన్న తాత మాటలు .. ఆ పొగమంచు చూడగానే గుర్తుకువచ్చాయి. మన జీవతాల్లో సంతోషమయినా.. దు:ఖమయినా.. ముందుకు పోయేకొద్దీ ఓ రూపాన్ని సంతరించుకుంటాయి.. ఏ ఒక్క ఘటనా మనకోసం ఆగదు. మరో ఉదయం రాగానే అంతా మాయం. అది కాన్సెప్టు. దాటేయడమూ.. దాచడమూ ఏమీ లేదండి. ఇదంతా మీ ఊహకు వదిలేద్దామని .. అంతే.

    ReplyDelete
  7. @ఆత్రేయ గారు,

    రిప్లై ఇచినందుకు ధన్యవాదాలు..

    @తాత గారికి నమస్కారములు:-

    మీ తాతగారు..గాంధీ తాత అంత గొప్పోడండి..

    ReplyDelete
  8. చాలా బాగుంది.
    వుదయమయ్యే తరుణం ఎదురొచ్చి నిజాన్ని సప్త వర్ణాలలో చూపిస్తే నేస్తం తొలగిన మంచు తెర సాక్షి గా కరిగి కన్నీరవ్వవలసి వస్తుందేమో...

    ReplyDelete
  9. bavundi. kakapote nenu inko concept lo ardam chesukunanu. your explanation is also nice.

    ReplyDelete