Thursday, April 22, 2010

వాన


ఒకటే వాన
బరువుతగ్గిన ఆకాశం

చినుకుల మధ్యగా
ఆటలాడుతూ చిరుగాలి

గుప్పుమంటూ
గుంటలు నింపుకున్న నేల

తలదాచుకునే ఆరాటంలో
పడుచుదనం పట్టించుకోని పాఠం..
పల్లానికి పరుగెట్టి..

చిన్నారుల కాళ్ళక్రింద చిందులవుతూ..
తాత చేతిపై జ్ఞాపకమవుతూ..

చూరుక్రిందా తడిసిన తలల
తలపుల్లో గుబులు ఒలకపోస్తూ..

ఒకటే వాన.

5 comments:

  1. మూసిన రెప్ప క్రిందా, తడికలలు
    తొట్రుపడ్డా కురిసేదీ వానే - ఒకటే వాన
    ఉప్పుటేరుల బురద కొట్టుకుపోతూ,
    నిట్టూర్పు చారికలు పరుచుకుంటూ ఒకటే వాన!

    ReplyDelete
  2. బరువు తగ్గించుకున్న ఆకాశం, నేలపైన వాన ఆనవాళ్ళని తడుముకుంటోంది.

    ReplyDelete
  3. 1. కన్నీటి చుక్క
    నా లోపలి వానని
    ఎత్తి పొస్తోంది.

    2. కన్నీటి చుక్క
    జారిపడే ముందు
    ఉప్పొంగుతుంది

    ReplyDelete
  4. simple gaa chaalaa baavundandi.chaalaa nachindi.

    ReplyDelete