Wednesday, February 17, 2010

తృప్తి


తడి మెరుపులుల్లో
కరిగిన చూపులు ..
ఉరుము ధ్వనుల్లో
మమైకమైన మౌనం ..

జడివాన జల్లుల్లో..
జోరు గాలుల్లో..
వాడిన రెక్కమందారాలు

ఎర్రబారిన చందమామను
ఎదలోతుల్లో గుచ్చేసరికి
ఏడడుగులు నడిచిన తృప్తి
వెచ్చగా తాకింది.

గుండెలపైన మరో రాత్రి
బద్ధకంగా అస్తమించింది.

8 comments:

  1. gundelapina maro raatri/baddakamga astaminchindi..entabaavundee ee expression!

    ReplyDelete
  2. ఎర్రబారిన చందమామను
    ఎదలోతుల్లో గుచ్చేసరికి
    ఏడడుగులు నడిచిన తృప్తి
    వెచ్చగా తాకింది.

    గుండెలపైన మరో రాత్రి
    బద్ధకంగా అస్తమించింది.

    నాకైతే తమదైన శైలిలో మరో ఉదయాన్నిలా స్వాగతిస్తున్నట్లు అనిపిస్తుంది. అస్పష్టమైన భావాలకో స్పష్టమైన రూపం వచ్చినట్లనిపించింది గురువుగారూ!

    ReplyDelete
  3. ఎర్రబారిన చందమామను
    ఎదలోతుల్లో గుచ్చేసరికి
    ఏడడుగులు నడిచిన తృప్తి
    వెచ్చగా తాకింది....
    చాలా బాగుంది...

    ReplyDelete
  4. very nice. teeyani ratrulu migilchina trupti ea bhashalo chitrinchali.

    ReplyDelete
  5. శ్రీ ఆత్రేయ గారికి, నమస్కారములు.

    కవిత చల్లని వెన్నెలలా వున్నది.



    భవదీయుడు,
    మాధవరావు.

    ReplyDelete
  6. స్పందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

    ReplyDelete
  7. chala bhaga rasaru.... ee kavitha chadhavadam oka manchi anubuthi

    ReplyDelete