ఒకటే వాన
బరువుతగ్గిన ఆకాశం
చినుకుల మధ్యగా
ఆటలాడుతూ చిరుగాలి
గుప్పుమంటూ
గుంటలు నింపుకున్న నేల
తలదాచుకునే ఆరాటంలో
పడుచుదనం పట్టించుకోని పాఠం..
పల్లానికి పరుగెట్టి..
చిన్నారుల కాళ్ళక్రింద చిందులవుతూ..
తాత చేతిపై జ్ఞాపకమవుతూ..
చూరుక్రిందా తడిసిన తలల
తలపుల్లో గుబులు ఒలకపోస్తూ..
ఒకటే వాన.
మూసిన రెప్ప క్రిందా, తడికలలు
ReplyDeleteతొట్రుపడ్డా కురిసేదీ వానే - ఒకటే వాన
ఉప్పుటేరుల బురద కొట్టుకుపోతూ,
నిట్టూర్పు చారికలు పరుచుకుంటూ ఒకటే వాన!
బరువు తగ్గించుకున్న ఆకాశం, నేలపైన వాన ఆనవాళ్ళని తడుముకుంటోంది.
ReplyDelete1. కన్నీటి చుక్క
ReplyDeleteనా లోపలి వానని
ఎత్తి పొస్తోంది.
2. కన్నీటి చుక్క
జారిపడే ముందు
ఉప్పొంగుతుంది
simple gaa chaalaa baavundandi.chaalaa nachindi.
ReplyDeleteVery nice
ReplyDelete