Tuesday, February 9, 2010

జ్ఞాపకాల గుబాళింపు..


నిద్ర జార్చుకున్న నింగి మధ్య
విరగ పూసిన కలువ
ఆపై వేచిన తుమ్మెద పలకరింపు..

కంటి కొలకులు చూసిన
ముత్యాల పలవరింపు..

అలసిన అలజళ్ళను అలవోకగా ఏరుకుంటూ..
ఒడిలిన తెరల వెనకగా
ఎగబ్రాకిన వేకువ కిరణం..

వెచ్చగా ఒళ్ళిరిచుకున్న
జ్ఞాపకాల గుబాళింపు..

7 comments:

  1. చక్కటి కవితలకి అంతే చక్కటి ఫోటోలు ఎంచుకోవడం మీకే చెల్లు..! ఒకోసారి మీరు ఫోటో చూసే కవిత రాస్తారేమోననే సందేహం కూడా వస్తుంటుంది నాకు ;-)

    ReplyDelete
  2. ఫోటో, కవితా రెండూ చాలా బాగున్నాయండి!

    ReplyDelete
  3. నీ జ్ఞాపకాల గుభాళింపు
    మదిని మైమరపిస్తుంటే
    అదనుచూసి ఎగిరెళ్లి పోయావ్
    నాసంతోషాన్నీ నీతోనే
    తీసుకెళ్ళిపోయావ్ !
    అందుకుందామని బంధాలన్నీ
    తెంచుకొని నీవెంట వస్తే
    అందనంత ఎత్తుకెళ్ళి
    వెక్కిరించావ్ !
    కవిత , చిత్రమూ పోటీ పడుతున్నట్టున్నాయండీ !

    ReplyDelete
  4. అక్షరమోహనం గారు (మీ అసలు పేరేమిటో ?) మధురవాణి గారు, పద్మార్పిత గారు పరిమళంగారు మీకు నామీదున్న అభిమానానికి ధన్యవాదాలు

    ReplyDelete
  5. super sir
    after a long time i am back to read your impressions
    awesome

    ReplyDelete
  6. hoyalolikutu gubalistunna me kavitha hrudayaniki vandanam. meru rastunna style nachindi athreyagaru.

    ReplyDelete