గుండె గదిలో బందీని చేసి
గురుతుకొచ్చిన ప్రతిసారీ
తలుపు తడుతున్నావు ...
కంటి రెప్పల్లో ఖైదు చేసి
అలసి సోలిన ప్రతిసారీ
అలజడి చేస్తున్నావు...
మోడుచెట్టుకు ప్రాకిన మల్లె పొదలా..
మనసంతా నిండి మత్తు రేపుతున్నావు..
తలనెత్తి నీకు దూరమవలేక
ఒదిగి చెంతన చేరినపుడల్లా..
నింగి ఎత్తుకు నెట్టి దూరమవుతావు..
పొంగు ప్రేమను పంచ
చేజాచినపుడల్లా..
ఓడిపోయానంటు మోకరిల్లుతావు..
అగాధాల అంచు కాక
మరి ఇదేమి నేస్తం?
పరిమళం గారు రాసిన "మనసు మూగబోతున్నా " కవితలు నా స్పందన.
http://anu-parimalam.blogspot.com/2010/02/blog-post.html
చాలా బాగుంది ఆత్రేయ గారు. ఆఖరి పదం అసంపూర్తి గా అనిపించి నేను ఇలా పూర్తి చేసుకున్నా చదువుతూ..
ReplyDeleteఅగాధాల అంచున జారి నీ జ్నాపకాల లోయలోకి పడబోతుంటే
వర్తమానాన మెరిసే తీపి నవ్వుల కానుకవుతావ్..
నువ్వెవరో నాకు?
manasu mooga boinaa mee spandana baavundi.!
ReplyDeletechaala bagumdi anDi ,
ReplyDeleteబాగుంది ఆత్రేయగారు.
ReplyDeleteచక్కటి భావాలు చూపించారు. బాగుంది.
ReplyDeleteఏ సందర్భానికైనా అలవోకగా కవితనల్లేయడం మీకే సాధ్యం గురువుగారూ ! అందమైన మీ స్పందనకు ధన్యవాదాలు .
ReplyDeleteపరిమళం గారి కవిత, మీ ప్రతి కవిత రెండూ ముచ్చటగా ఉనాయి :)
ReplyDeletechala bagunnai atreyagaru. chala common ga jarige sangatanalanu highlight chestu intresting ga vivaristunnaru me kavithalalo. manchi bhavalu kadilistunnaru.
ReplyDelete