Thursday, August 6, 2009

అంతా మిధ్య..


వయసు కేంద్రం..
భవిత ఇంధనం...
జ్ఞాపకాల తరుగు..
ఆశల వాలు..
బంధాల మోత..
అనుభవపు మిగులు..
బాధ కుదుపులు..
విధి పధం..
బ్రతుకు చక్రం..
పయనం !

జారిపోతూ.. ప్రస్తుతం
దృశ్యమాత్రంగా..
ఏది స్థిరం ?

మరి నా పయనమెక్కడికి ?
దేనికోసం ?

అన్నీ
కరిగిపోయేవే.. మిగిలిపోయేవే..
కదిలిపోయేవే.. నిలిచి పోయేవే ..
అంతా మిధ్య..

8 comments:

 1. caalaa baagundi

  ReplyDelete
 2. అంతా మిధ్య అనుకుంటూ మనం మౌనం దాలిస్తే నేటి రాజకీయ నాయకులు మొత్తం చాప చుట్టేసి చంకన పెట్టి పోతున్నారు సార్. గాలులు, వైయెస్లు, బాబులు తాగేందుకు ఫ్రీగా నీళ్ళు కూడా మిగల్చడం లేదు. అంతా సరుకు చేస్తున్నారు. కాస్తా రెప్ప తెరవండి. Sri Sri gaari amtaa midhyantaaru.. marokasaari chadavamdi.

  ReplyDelete
 3. కరిగిపోయేవే... కలలు కల్లలుగా
  మిగిలిపోయేవే.. ఆ కలల జ్ణాపకాలుగా

  కదలిపోయేవే.. ఆ యెద పలికిన మదురిమలు
  నిలిచిపోయేవే.. నీ పలుకుల సరిగమలు

  మిధ్యలాంటి.. గతంలో
  వాస్తవం.. చిగురుతొడిగి
  మొగ్గలేస్తుంది.. భవిష్యత్తులో

  కదండీ గురువుగారూ!!!

  ReplyDelete
 4. ముందుగా ఫొటో ముందు ఊగాను. ఏదో అయ్యింది.
  తరువాత కవిత చదివాను. అంతా సర్దుకొంది. :-)
  చాలా బాగుంది కవిత.

  బొల్లోజు బాబా

  ReplyDelete
 5. అంతా మిధ్య :) nice

  ReplyDelete
 6. బతుకు చక్రం కళ్ళ ముందు..తిప్పేసారు..ఓ చిత్రం గీసేసారు.. :)

  ReplyDelete
 7. చక్ర భ్రమణం మిథ్యా? మార్మికమా?
  చివరికంతా శూన్యమై, నేనొక అనామికనై,
  నాదంటూ కానిదాన్నే నాదని భ్రమిస్తూ,
  భ్రమరమై, భ్రాంతి చుట్టూ భ్రమణం చేస్తూ,
  సమరమై, ఓటమినే వరిస్తూ,
  దీనంతకీ నాకు నేనే సాక్షినెందుకయ్యాననుకుంటూ,
  ఛీ ఛీ నాదీ ఒక బ్రతుకేనా అనుకుంటూ,
  అసలదీ నాదేనాననుకుంటూ,
  నిజమే నాదేదీ కాదు, నాకేమీ లేదనుకుంటూ,
  ఆఖరుకి ఈ నిర్లిప్తతా నాదికాదన్న నిజం నిజాయితీగా స్వీకరిస్తూ,
  నన్నింత నాశనంచేసిన నా మనసుని ద్వేషిస్తూ,
  నా మరణాన్ని ధ్యానిస్తూ, నా ప్రశ్నలకదొకటే బదులని,
  నాకు నేనే మరణ శాసనమేసుకుంటూ,
  నా మరణ వాంగ్మూల్యం నేనే పఠిస్తూ,....
  -అయ్యాయా... నన్నింత వెతల పాల్చేయటం తమకి తగునా :( ఆత్రేయా?

  ReplyDelete
 8. అనానిమస్ గారు ధన్యవాదాలు.

  వర్మగారు నిజమే..మన నేతల గురించి నేపడ్డ వేదనను 'రాజకీయం' అన్న లేబుల్లో చూడండి.

  శ్రుతిగారు బాగా చెప్పారు. కొన్నికోణాల్లో మీరు చెప్పింది అక్షర సత్యం. ధన్యవాదాలు.

  బాబా గారు మొత్తానికి సర్దుకుందన్నమాట. అంతా మిధ్యకదా కనపడేదీ కనపడనిదీ అన్నీ హుళక్కే.

  ధన్యవాదాలు నేస్తం.

  శివ గారు మన బ్రతుకు చక్రం ముందుకే తిరుగుతుంది. ఇక్కడ బొమ్మలో చక్రం మటుకు, మన ఆలోచనలాగానూ.. మన జ్నాపకాల లాగానూ.. ఆశలాగా.. ముందుకు వెనక్కు మన మనసుని అనుసరించి తిరుగుతుంది.

  ఉష గారు.. ఏమిటో.. అందరినీ ఇలా వేతల పాలు చేస్తున్నానన్న మాట. ఐనా అదికూడా మిధ్యేకదా.. :-) ధన్యవాదాలు.

  ReplyDelete