Monday, July 13, 2009

నా ప్రేమతో నీకో నీకో రూపమిచ్చాను





పిలిచి పిలిచి నాలుక పిడచకడుతున్నా..
ఎదురు చూసిచూసి కళ్ళు రంగుమారుతున్నా..
శ్వాస బదులు నిట్టూర్పులు సెగలు రేపుతున్నా.
గుంటకంటిలో జీవం ఏ గుండె గంటలు చేరదు !!

మనసు తవ్వి జ్ఞాపకాలు పూడ్చి
త్యాగమనో గెలుపనో ఫలకన్ని తగిలించి
ఆశ నీళ్ళతో అభ్యంగన మాడించి
గుండె పెంకుల్లో ముఖం చూడలేను.

ప్రణయమని పగిలి మిగిలేకంటే
అహంతో గద్దించి గెలవడమే
నాకిష్టం..
మొండి ప్రేమలో..
దీపపు పురుగును కాలేను..

నువ్వు మనలేకనే.. మనగలవా అన్న ఆ ప్రశ్న..
మరో సారి నిన్ను నువ్వు చూసుకో..
ప్రణయమని కరుగుతావో.. ప్రక్షాళితమవుతావో.

my response to Sruti's kavita at http://sruti-minestam.blogspot.com/2009/07/blog-post_12.html

2 comments:

  1. మీ ప్రతి స్పందన బావుంది ఎప్పటిలాగే ....కానీ బొమ్మచూస్తేనే భయమేస్తుంది .

    ReplyDelete
  2. పరిమళం గారూ.. భయం కలగడమే కావలిసినదికూడా..

    సాన పట్టిన కత్తులతో ఆడేటప్పుడూ..
    కరెంటు ప్లగ్గులో వేలెట్టేటప్పుడూ..
    దంచివున్న కారంలో కాళ్ళేట్టినప్పుడూ..
    అమ్మవేసిన వీరంగం గుర్తుందా .. ?

    ఆమంటలో కాలేది తనే !!
    ఆ శిక్ష తనదే.. తనకే సొంతం..

    ఈ కవిత శృతి రాసిన కవితకు స్పందన. తనకవితలోని నాయకుడి రెస్పాన్సు ఇది. ఇక్కడ పైన చెప్పినట్టు.. అమ్మ వేసే వీరంగమే అతనిదీ.. తమకు చేతిలో లేని విధి విధానం వలన వేరవాల్సివచ్చింది. అది తాళలేని తన సఖి కన్నీరు కారుస్తుంది.. ఏ నిజమయిన ప్రేమికుడు అది చూడగలడు.. నయానా.. భయానా.. తనని ఓదార్చాలి.. సౌమ్యంగా చెపితే పిల్లకాయలు వినరు.. అందుకే.. ఇలా.. ఆ బొమ్మ చూస్తే భయమేయాలి.. అప్పుడే కవితకు పూర్తి న్యాయం జరిగినట్టవుతుంది. భయమో.. ఈసడింపో తనమీద కోపమో.. ఏదో ఒకటి.. తను ఇప్పుడున్న బాధనుండి బయటకు పడటానికి.. అతనికి చేతనయింది అంతే.. ఇవ్వగలిగింది అంతే ... ఆపేక్షే.. కొండంత.. ఏంచేస్తాం.. విధి వంచితుడు. తను మండుతున్నా.. తన ప్రేమకోసం.. కోపం నటిస్తున్నాడు.

    ReplyDelete