జీడిపప్పు గారు
మంచి విషయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు. అతనికి శిరస్సు వంచి పాదాభి వందనం చేస్తున్నాను. మీరు పంపిన లింకులకు నా చిరు స్పందన. కవిత అని అనలేమేమోగానీ.. వచ్చిన భావాలను వచ్చినట్లు యధా తధంగా కాగితం ఎక్కించాను. మీ అభిప్రాయం చెప్పగలరు...
మీరిచ్చిన లింకులు ఇక్కడి చదువరులకోసం మరోసారి
http://i28.tinypic.com/2jvbm1.jpg
http://i26.tinypic.com/34ika6x.jpg
ఆటో నడిపే దేముడు...
=================
అమ్మ తనాన్ని అమ్మేవాళ్ళూ..
ఆ పిలుపుని పిండమప్పుడే నలిపేవాళ్ళూ..
అద్దెకడుపుల వేలంపాటలూ..
ఏడడుగులేసిన ఏడోరోజే చూరు అంచులకు చేర్చే వాళ్ళూ..
ఆకలి కేకల్లో ఆరాటమార్చుకునే వాళ్ళూ..
కకృతి కోరల కరాళ నృత్యం..
కాగితం చుట్టగా.. ముంగిట్లోకి..
మధ్య పేజీలో మరో ఉదయం..
కలికాలపు ప్రవాహంలో...
అడ్డుగా .. ఓ గడ్డి పరక.
తన బ్రతుకే ఎదురీత..
ఎన్ని కడుపుల భారాన్నో మోస్తూ
ఓ కాలుతున్న కడుపు..
ప్రతి క్షణమూ ప్రసవ వేదనే..
చెక్కిళ్ళపై ఆగని పురిటి స్నానాలే..
ఏడుకొండల మీడ హుండీలు నింపుతూ
ఏ గర్భ గుడిలోనో మనమెదికేవాడు
మూడు చక్రాల గుడిలో
నిండు గర్భాలు మోస్తూ
మన మధ్యనే తిరుగుతున్నాడు..
చెమరిన కళ్ళతో..
తన కాళ్ళకిదే కవితాబిషేకం.!!
"మూడు చక్రాల గుడిలో
ReplyDeleteనిండు గర్భాలు మోస్తూ
మన మధ్యనే తిరుగుతున్నాడు.."
శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నానాదేవుడికి !
ఎంత బాగా రాశారు గురువుగారూ !
"ఏదుకొండల మీడ హుండీలు నింపుతూ
ReplyDeleteఏ గర్భ గుడిలోనో మనమెదికేవాడు
మూడు చక్రాల గుడిలో
నిండు గర్భాలు మోస్తూ
మన మధ్యనే తిరుగుతున్నాడు.."
హాట్సాఫ్!!!! మీలా వ్రాయగలనా ఎప్పటికైనా?
"ఏడుకొండల మీడ హుండీలు నింపుతూ
ReplyDeleteఏ గర్భ గుడిలోనో మనమెదికేవాడు
మూడు చక్రాల గుడిలో
నిండు గర్భాలు మోస్తూ
మన మధ్యనే తిరుగుతున్నాడు.."
అడిగిన వెంటనే ఆణిముత్యాన్ని ఇచ్చారు ఆత్రేయ గారు. వేవేల ధన్యవాదాలు.
Please check this:
ReplyDeletehttp://jeedipappu.blogspot.com/2009/07/blog-post_14.html
Atreya gArU,
ReplyDeletemaLLI mana madhya gyAp vaccimdi. Emi anukOvaddu. samasyApUraNamlO nA padyam naccinamduku dhanyavAdAlu.
"ఏడుకొండల మీడ హుండీలు నింపుతూ
ReplyDeleteఏ గర్భ గుడిలోనో మనమెదికేవాడు
మూడు చక్రాల గుడిలో
నిండు గర్భాలు మోస్తూ
మన మధ్యనే తిరుగుతున్నాడు.."
అద్బుతమైన ఎక్స్ప్రెషను.
బాగుంది
బొల్లోజు బాబా
గురువు గారూ!
ReplyDelete"ఏ గర్భ గుడిలో....", అద్భుతమైన భావన. మీ కవితాభిషేకం స్వచ్చమైన పాల వెల్లువలా ఉంది.
నా ఆలోచనలు అక్షర రూపం దాల్చలేదింకా.
నిజమైన నజరానా ఇచ్చారు సార్.
Super sir ...
ReplyDeleteఆటొ ప్రకాశ్ కి పాదాభివందనం మీ కవితకు వందనం
ReplyDeletePlease watch my latest posting
పరిమళం గారు, పద్మార్పిత గారు, జీడిపప్పు గారు, శంకరయ్య గారు, బాబా గారు, శృతి గారు, భారారె గారు, వెన్నల రాజ్యం గారు వర్మ గారు ఇటుగా వచ్చి భుజంతట్టినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteఈ అవకాశం ఇచ్చిన జీడిపప్పు గారి చాలా చాలా ధన్యవాదాలు, అభినందనలు.