Tuesday, April 14, 2009
నన్నిలానే చావనీ..
కన్నీరొలకనీయకని చెప్పకు
నేనెందుకు ఇలా వున్నానో నీకు
తెలియదనీ చెప్పకు..
ఈ కోతకి కారణం నీకెరుకలేదనీ చెప్పకు ..
నిండిన కళ్ళు, తడి చెక్కిళ్ళు
గద్గదమయిన స్వరమూ
ఈ తడీఅరిన గొంతుకనూ విడిచి
దైర్యంగా బ్రతకమనీ చెప్పకు ..
ఈ గుండె లోతుల్లోని విషాదాన్ని
ఏమర్చి బ్రతుకు నడపాలన్న కోరిక
నాకు ఏ కోశానా లేదు.. అది ఎందుకో
నీకు అర్ధమవ్వాలనీ లేదు.
చెప్పాల్సిన అవసరమూ లేదు..
ఎందుకో.. నిష్కారణంగా.. ఈ రోజు
నా కళ్ళు ఒలుకుతున్నాయి..
పెదవులు వణుకుతున్నాయి..
గట్టి నిర్ణయాలు కొరుకుడు పడకేమో
ఐనా నీకెందుకు చెపుతున్నానూ ?...వదిలేయి..
నా బ్రతుకెలా మారిపోయింది
నేనెలా ఉండేవాడినో కూడ మర్చిపోయాను..
ఏమీ ఎరగనట్లు, ఏమీ జరగనట్లు
తల తిప్పుకుని వెళ్ళిపోయావు..
అంతకన్నా ఆశించినదేమీ లేదులే.
నేను ఆ పాత నాలా మార కోరట్లేదు
ఎప్పటికీ.. కొన్ని గాయాలు పచ్చిగా ఉంటేనే..
శిక్ష కఠినంగా ఉంటేనే గానీ. ఈ కసి తీరేట్టుగా లేదు
అనుభూతి అందంగా ఉన్నట్టుంది
అది పూర్తిగా నన్ను వశంచేసుకున్నట్టుంది.
నేనేమి చెయ్యనూ.. అంటావా...
అయ్యో ఆగి మరీ విన్నావా ?..
క్షమించు.. ఇది నా స్వగతం..
నీ బ్రతుకు నీది.
ఇలానే నా ఆశ కాష్టాల
నెగడులో చలి కాగుతూ..
అశృధారలతో నా గాయాలు
తనివి తీరా కడుగుతూ..
నా బ్రతుకు బతకనీ
నన్నిలానే చావనీ..
Subscribe to:
Post Comments (Atom)
ఆత్రేయ గారూ, మీరు కూడా ఇలాంటివి ప్రారంభించేశారా?? ఏంటండీ అంత వేదన నింపేశారు? :(
ReplyDeleteపిచ్చబ్బాయ్ గారు. మొత్తానికి మీచేత కామెంటు పెట్టిచ్చిందన్న మాట. యాదృచ్చికంగా గూగుల్లో ఈ ఫొటో కనబడింది, దానికి స్పందించి రాసినది ఇది. ఇలాంటివి ఇప్పుడు మొదలెట్టడమేమిటండీ.. ఇంతకు ముందు ఇలాంటివి చాలానే రాశాగా.. ఏమయినా.. ఇటుగా వచ్చి కామెంటినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteనేను ఆ పాత నాలా మార కోరట్లేదు
ReplyDeleteఎప్పటికీ.. కొన్ని గాయాలు పచ్చిగా ఉంటేనే..
శిక్ష కఠినంగా ఉంటేనే గానీ. ఈ కసి తీరేట్టుగా లేదు..
అయ్యో ఆగి మరీ విన్నావా ?..
క్షమించు.. ఇది నా స్వగతం..
నీ బ్రతుకు నీది...
gloomy sunday ane oka suicde song undhi alaane anpinchindi...
మాధవ్ గారు ధన్యవాదాలు. నాబ్లాగుకు స్వాగతం. మీరన్న తరవాత గ్లూమీ సండే విన్నాను. దాని గురించి చదివాను. జర్మనీలో చాలా ఆత్మహత్యలకు ఈ పాట కారణమని తెలిసింది. ఆ పాటలోని సాహిత్యం కూడా చాలా బాగా అనిపించింది. మీరు ఈ కవిత అదివి అటువంటి చిక్కటి సాహిత్యాన్ని గురుతు చేసుకోవటం బాగుంది. ఎదో కనపడిన చిత్రానికి స్పందించి రాసిన కవితలో ఇంత వేదన నిండడం ఆశ్చర్యమే.
ReplyDeleteనైస్
ReplyDelete