శరీరంలో మూడొంతులు
నీళ్ళే, కళ్ళు కాస్త ఒలికితే
అంత బాధెందుకో ..
కళ్ళ కాగడాల్లో
చమురు నిండి చెక్కిళ్ళు తడిసినా
గుండె చీకట్లు పోవు.
మల్లె మాలల్లోనూ .. మందు సీసాల్లోనూ
ఒకటే వాసన..
మనసు బాగోక పోతే.
పశ్చాత్తాపం పరిహారమైనా
అది పడె మనసుకది
నరక యాతనే అవుతుంది.
నిశ్చలంగా ఉన్న నీళ్ళలో
పడ్డ పువ్వైనా రాయైనా
లేపే కలత తరంగాలు ఒకటే.
ఆనందంలోనూ, బాధలోనూ
తడిసే కళ్ళకు, గుండె భావం
అర్ధం అయినట్టా? కానట్టా ?
నోరు గుడ్డిది, కళ్ళు మూగవి
మనసు పిచ్చిది..
మనుషులు అసంపూర్ణులు.
మెదడు ప్రభుత్వం చేతిలో
సర్వాంగాలు పావులు
సజీవ సోషలిజం..
అనాధ చినుకుల అల్లరి
నేల చేరేలోపలే
అచ్చు మనలాగే .
అబ్బబ్బా! గొప్ప వ్యక్తీకరణలు/భావాలు... అన్నీ నచ్చేసాయి....
ReplyDeleteబావుంది మీ భావాల అల "జడి"
ReplyDeleteఆత్రేయ గారూ.... చాలా రోజుల తర్వాత నా మట్టి బుర్రకి అర్థమయ్యే మాటలపూవులు రాలాయి మీ కలం నుండి. చాలా చాలా నచ్చింది నాకు.
ReplyDeleteశరీరంలో మూడొంతులు
నీళ్ళే, కళ్ళు కాస్త ఒలికితే
అంత బాధెందుకో .. చాలా బావుంది. ఒకటేముంది లెండి. అన్ని చరణాలూ చాలా అందంగా ఉన్నాయి
ఒక్కో భావం ........ఒక్కో వజ్రం ......వెల కట్టలేం మేం .....జారే మీ భావాలను అందంగా చూపుతోంది ఈ చిత్రం .
ReplyDeleteబాగుంది.. :)
ReplyDeleteదిలీప్ గారు ధన్యవాదాలండి.
ReplyDeleteలలిత గారు నెనరులు.. మళ్ళీ దర్శనం ఎప్పుడో !
పిచ్చబ్బాయి గారు మీకు నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది...
పరిమళం గారు నిజమే.. ప్రతి ఒక్క భావము ఎంతో నిగూఢ అర్ధాన్ని, తత్వాన్ని చెపుతాయి.. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
ప్రేమికుడు గారు ధన్యవాదాలండి.
ReplyDeleteఆత్రేయ గారు!
ReplyDeleteఇవి జారే భావాలు కావు. మనో వినీలాకాశంలో ఎగిరే భావ విహంగాలు. మీకు నా హార్దిక అభినందనలు - డా|| ఆచార్య ఫణీంద్ర
ఆచార్య పణీంద్ర గారు ధన్యవాదాలండి..
ReplyDelete