రెండు చుక్కలు జారి
భావానికి రుచి పెంచాయి
ప్రకృతి ఎంత రమణీయం ?
మనసు ఎడారిలో
కంటి చెలమలు.. జ్ఞాపకాలు
కాక్టస్సులై మొలిచాయి..
గడ్డిపోచ మీద చినుకు,
వేచి ఉంది. రెండో దానికి స్థానమివ్వడానికి
రెప్పమీద ఉప్పు బొట్టులా
సముద్రుడి నోటి నిండా
ఉప్పు నీరే... జాలేస్తుంది..
ఎన్ని బాధలు పడ్డాడో ?
కవులకి రుచుల మీద
పెద్ద పట్టులేనట్టుంది.
అందుకే భావాలు చేదంటారు.
ఆశాసౌధాలు.. గాలి మూటలు
నీటి రాతలు.. రుచి ఒక్కటే ఉన్న
భావానికి ఎన్ని పేర్లో ..?
"ఏడిసి నట్టుంది "
ఎంత తేలికగా వాడతాం ..
జీవిత పాఠమేమో ?
దిగులో గని లాంటిది
తవ్వే మట్టెక్కువ, దిగే లోతెక్కువ
అసలు బ్రతుకు పైనే వదిలేస్తాం
తడి కళ్ళల్లో తేలాడిన
పదాలు, రెప్ప వాలే సరికి
కాగితం పైకి ఉరికాయి
నింగి నేల నెరుగు
కన్ను పెదవి నెరుగు
నీరు పల్ల మెరుగు
పెనవేసుకున్న చూపులు
చెయ్యగలిగిందేమీ లేకేమో
చటుక్కున కరిగిపోయాయి
ఆశ తీరక కన్నీరొలికినా
రగిలే ఆశపై నీరు చిలికినా
ని(నీ) రాశేగా..మిగిలేది
చావు పదవి గెలవటానికి
బ్రతుకంతా కష్టపడాలి.
అదొస్తే జనాలేడుస్తారు.. ఈర్ష్య !!
"పెనవేసుకున్న చూపులు
ReplyDeleteచెయ్యగలిగిందేమీ లేకేమో
చటుక్కున కరిగిపోయాయి"ఎలా చెప్పగలరు మీరు ఇంత బాగా!!
ఏంటో అందరిలోనూ జీవన రాగం, జీవిత సారం పలుకుతుంది... ఏ బ్లాగ్కవిని చూసినా అదే! నేను ఏదైనా గ్రహించాలని అందరూ ఓ పనిపడుతున్నట్టున్నారేమో!
ReplyDeleteచాలా బాగున్నాయి...
చాలా బాగుంది.
ReplyDeleteతడి కళ్ళల్లో తేలాడిన
ReplyDeleteపదాలు, రెప్ప వాలే సరికి
కాగితం పైకి ఉరికాయి
A very technical description of how a man turns out to be a poet. I like this a lot Aatreya garu.
పద్మార్పిత గారు, విజయమోహన్ గారు ధన్యవాదాలు.
ReplyDeleteదిలీప్ గారు మర ఇంకే మళ్ళీ రాయడం మొదలెట్టండి. రెండు నెలలయ్యింది మీరు రాసి. ఆవురావురని ఎదురు చూస్తున్నాము.
వర్మ గారు ధన్యవాదాలండి.
ఆనంద్ గారు బాగా పట్టారు భావాన్ని. ధన్యవాదాలు.
ఆత్రేయ గారు!
ReplyDeleteమీ త్రిపదలు బాగున్నాయి. అభినందనలు - డా|| ఆచార్య ఫణీంద్ర
ఆచార్య పణీంద్ర గారు ధన్యవాదాలండి..
ReplyDelete