Thursday, March 26, 2009

విరోధి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు.


బ్లాగు మిత్రులారా

మీకు మీ కుటుంబానికీ, శ్రేయోభిలాషులకు
విరోధినామ సంవత్సర శుభాకాంక్షలు.


పచ్చ చీర కట్టి
కొత్త పెళ్ళికూతురులా ..
విరోధి వచ్చింది

మోడు బ్రతుకుల
ఆశ చిగుర్లు కట్టింది..
గోడు విన్నదోలేదో

వసంత రంగం మీద
మరో నాటకం మొదలు..
విరోధి నామంతో

ఆశలకెన్ని కలలో
ఏ విరోధి కలపండేనో..
ఎన్నికలొచ్చాయి

సర్వం ధరించాం
సర్వాన్ని జయించాం
వచ్చింది విరోధే

నందనం రావాలి
వికృతి నశించి
తిమిరాలు ఖరమయ్యాక

ఆశలో తప్పులేదు
పచ్చడి రుచి గుర్తుందిగా..
తీపొక్కటే లేదు

13 comments:

  1. మీకు కూడా ఉగాది శుభా కాంక్షలు.. :)

    ReplyDelete
  2. మీక్కూడా మా మన నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. బావుందండీ కవిత.!
    మీకు..మీ కుటుంబానికీ..ఉగాది శుభాకాంక్షలు..!

    ReplyDelete
  4. మీకూ మీ కుటు౦బసభ్యులకూ కూడా తెలుగు నూతనవత్సర శుభాకా౦క్షలు.

    ReplyDelete
  5. పచ్చ చీర కట్టినా
    తెల్ల చీర వచ్చినా

    మోడు బ్రతుకు చిగురించినా
    ఆశల చిగుర్లు ఛిద్రమైనా

    ఎన్ని వసంతాలొచ్చినా
    ఎన్ని జీవితాలు నాటకాలైనా

    సర్వధారి విరోధియైనా
    విరోధి మరో రూపమెత్తినా

    నందనం వికసించినా
    ప్రకృతి నసించినా

    ఆత్రేయ ఆర్తి
    కవితా స్ఫూర్తి
    కాలని కతీతం
    కవితా కలశం.


    మీకూ మీ కుటు౦బసభ్యులకూ కూడా తెలుగు నూతనవత్సర శుభాకా౦క్షలు.

    ReplyDelete
  6. మోడు బ్రతుకులు.. ఏనాటకంలోనైనా ...పాత్రలే..
    అదేకధ..!
    మారుతోంది కేవలం పేరే..!

    ఇంకా అవే ఎదురు చూపులు...
    విరోధి.. పాపం పండేనా అని..
    మైత్రి..దొరికేనా అని..

    ఆ కలలే పండితే...

    అప్పుడు.. ప్రతి పాత్ర..'నాయకుడే'..


    మీకు.. మీ కుటుంబానికి.. విరోధి నామ సంవత్సర ...శుభాకాంక్షలు.. :)

    ReplyDelete
  7. ఆత్రేయ గారూ, అదృష్టవ౦తుల౦డీ మీరు, రామిరెడ్డిగారి వ్యాఖ్య కారణ౦గా! ఎ౦త మ౦చి అభిమానాన్ని స౦పాది౦చుకున్నారు?

    ఆత్రేయ ఆర్తి
    కవితా స్ఫూర్తి
    కాలని కతీతం
    కవితా కలశం.

    ఇది చూసి నాకు భలే మ౦చి వర్ణన గుర్తొచ్చి౦ది.

    కొ౦టె బొమ్మల బాపు
    కొన్ని తరముల సేపు
    గు౦దే ఊయలనూపు
    ఓ కూనలమ్మా!

    ReplyDelete
  8. మీకు..మీ కుటుంబానికీ..ఉగాది శుభాకాంక్షలు :)

    ReplyDelete
  9. విజయ్ విజయమోహన్ మరురవాణి గార్లకు ధన్యవాదాలు.

    ఆనంద్ మళ్ళీ ఆనంద్ గారికి ధన్యవాదాలు. నిజమే ఆనంద్ గారు మీరందరు చూపిస్తున్న ఆదరం నిజంగా .. (కళ్ళజోడు తీసి నా పంచకు తుడుచుకుంటూ..పైనున్న చూరు చూస్తూ...అక్కినేనిలా .. ఇక మిగిలింది మీరు ఊహించుకోండి)

    శివ గారు.. మీరు... మీ శైలిలో.. ఎప్పట్లానే. అందంగ..
    అవునా.? . కాదేమో.. ఆహ్లాదంగా.. సరికాదేమో.. పోనీలే
    ..బాగా స్పందించారు. ధన్యవాదాలు.

    పరిమళం గారు మీకు కూడా ధన్యవాదాలు.

    ReplyDelete
  10. ఆత్రేయ గారూ మీ కవిత ఎంతమంది నుండి కవితలను వెలికి తీస్తోందో చూడండి... చాలా ఆనందంగా ఉంది...

    మీ కవితలన్నీ సంకలనంగా ఓ మంచి పుస్తకంగా వస్తే ఆనందించే వాళ్లలో నేను ముందుంటాను. కోంచెం అటువంటి ప్రయత్నాలేవైనా చేద్దురూ... :)

    మీకూ, మీ కుటుంబానికీ ఉగాది శుభాకాంక్షలు. :)

    ReplyDelete
  11. ప్రేమికుడు గారు ధన్యవాదాలు. మీఅందరి అభిమానం నా ఏ పూర్వ జన్మ సుకృతమో..

    ReplyDelete
  12. ugaadi subhaakaankshalu andi Atreya gaaru.

    ReplyDelete
  13. నీకు కూడా పూర్ణా... అబ్బ ఎన్నిరోజులయిందొ మిమ్మల్ని ఇక్కడ చూసి.

    ReplyDelete