సంధ్య సాయంత్రం ఎప్పటిలానే
పండు భానుడ్ని భుజానేసుకుని
పడమటి దిక్కుగా ప్రయాణమయ్యింది.
దారిలో చూడలేక చీకటి చేతుల్లో ముఖం
దాచుకుంటూ పొద్దు తిరుగుడు పల్లె జనాలు
బాధగా వన్నె తగ్గి తలలు వాల్చారు.
దూరపు కొండలన్నీ, ఈ రోజు, నిన్నలానే
బంగారు జరీ అంచు నల్ల దుప్పటి
కాళ్ళమీదనుంచి ముఖం పైకి లాక్కున్నాయి.
కన్నెర్ర జేసిన నింగి నుదిటిన స్వేద బిందువులు
మిణుకు మిణుకు మంటే, నోరెళ్ళబెట్టిన
చంద్రుడు పాలిపోయి సగం ముఖం దాచుకున్నాడు.
రోజు కాలం చేసింది.. రాత్రి ఉదయించింది.
యాండోయ్
ReplyDeleteయ్హమ్హాగా హుందండే.స్వేదం మిణుకుమంటే సంద్రం బాబాయ్ నోరెళ్ళబెట్టాడాండీ, అల్లా ఎల్లాగండీ? అట్టా అనుగుంటే సపోసు, ఫర్ సపోసు స్వేదం బారుబద్దలైతే సంద్రం బాబాయికి ఏటవుదాదండీ! నల్లదుప్పటేస్కుని నిసీది లోకి సొరబడి నిప్పు కణికలు పప్పు బెల్లాల్లాగా తినేత్తాడాండీ? యాండోయ్ , మీరు నిజ్జంఘా కళాకారులండోయ్. మొత్తానికి కైత అంతా బాందండీ, ఒక్క సివరాకరి పేరా తప్ప. అది పేద్ద లోటే మారాజా. కూసింత లుక్కేసుకోండే.
ఆ ఉదయమూ మరో వేకువగా తిరిగోచ్చేలోపు వస్తుంది మరో రోజు. కాలం కొమ్మ మారాకు చివుర్లు మళ్ళీ మళ్ళీ వేస్తూనేవుంటుంది.
ReplyDeleteయాండోయ్ కుమార్ గారూ మీయాస మహరంజుగుందండి. నాకైత కొంత నచ్చినందుకు మా హాపీగుందండి. థాంక్యూ. ఇక పోతే..మరదే ఎవరనకండి..మారాజ ఆడకే వత్తండా.. మీరు సంద్రం అంటే .. బాంచన్..సముద్రమనుకున్నే..బేజా బేజారయింది.. నాకైతలో ఇదేడ దూరిందోనని.. నా సికిని బుర్రకందలేదయ్యా.. చంద్రుడని తరవాతెల్గింది. మీర్జెప్పినట్టు ఆ సివరాకరి పేరా..కూసింతేందండి.. కునుకుమరిచి సూసినా..మీరేప్పిన లోటు నాకైతే కన్పడ్లే.. మీరూ మరోలుక్కేసి మళ్ళీ జెప్పుండ్రీ లోటేటో.లోతెంతో !!
ReplyDeleteఉష గారు ధన్యవాదాలు.
విరోధి నామ సంవత్సర శుభాకాంక్షలు....
ReplyDeleteఆత్రేయగారికి, నమస్కారములు.
ReplyDelete" రోజు కాలం చేసింది..." : ఈ కవితను మీరు వ్రాస్తున్నపుడు, నేను మీ ప్రక్కనే, చెట్టు రూపంలో వున్నాను. మీ అసలైన, సిసలైన కవితా భావుకతకు "సాక్షీభూతంగా". బాగు,బాగు.
మాధవరావు గారు చెట్టుగా చెంతనిల్చి సేదిదీర్చి నందుకు భావుకతకు సాక్షీభూతంగా నిల్చి చేయూతనిచ్చినందుకు ధన్యవాదాలు.
ReplyDelete