వసంతుడు చిటారు కొమ్మన
పచ్చ జెండా ఎగరేశాడు..
చెట్టెక్కడానికి ఇంతసేపు పట్టిందా ?
ఎక్కడో సరికొత్త రంగుల
ప్రపంచం దిద్దినట్టున్నాడు
పెరట్లో కుంచే విదిలించాడు!! దేవుడు.
చెట్లూ నాతో హోలీ ఆడుతున్నాయి
కడిగినా పోని రంగులు.
నా కళ్ళకద్దు తున్నాయి.
రంగు రంగుల నవ్వులు..
ఆ శబ్దాన్ని.. మధురంగా.. తుమ్మెదలు
దాచుకుంటున్నాయి.. రేపటికోసం.
చుప్పనాతి రెప్ప
అన్ని రంగులనీ...చటుక్కని.. నల్లగా..
క్షణంలో మారుస్తుంది..
ఏంటో మరి.. అన్నీ పచ్చగా
కనిపిస్తున్నాయి...
మనసుకి వసంతమొచ్చినట్టుంది.
పంజరంలో కోకిలకి, బోలెడు
మావి చిగురు పెట్టాను.. కూయలేదు
వదిలేశా ... పాడుతూ వెళ్ళిపోయింది.
పెద్ద పన్నీరు బుడ్డిలో
నడుస్తున్నట్టుంది.. ఒకే దాంట్లో
ఇన్ని గంధాలు ఎలా అమిరాయి ?
తెల్లారే సరికి కొమ్మల చివర
రంగు తూటాలు పేలాయి
శబ్దానికి వసంతుడు మేల్కొన్నాడు
పడమర ఓ గంట కోల్పోయింది..
తూర్పు సంబరాల్లో ముణిగింది
వసంతుడే సాక్షి
మన బ్రతుకులో లేని రంగులు
బయటనుంచి కొనుక్కొచ్చి
జనాల మీద విసిరి మురుస్తున్నం
తన సంకెళ్ళు తెంచుకుని
దొరికిన రంగులన్ని మోసుకుంటూ
తోటంతా జల్లుతుంది. సీతాకోకచిలుక
పువ్వుల ప్రేమ సందేశం
తుమ్మెదలు తీసుకెళ్తున్నాయి
ఎన్ని సఫల మవుతాయో ?
రంగు రంగు లతలు పెనవేసుకునేసరికి
పచ్చ గడ్డాలు పెరిగిన
ఋషుల తపస్సు భంగమయ్యింది
మన బ్రతుకులో లేని రంగులు
బయటనుంచి కొనుక్కొచ్చి
జనాల మీద విసిరి మురుస్తున్నం
తన సంకెళ్ళు తెంచుకుని
దొరికిన రంగులన్ని మోసుకుంటూ
తోటంతా జల్లుతుంది. సీతాకోకచిలుక
పువ్వుల ప్రేమ సందేశం
తుమ్మెదలు తీసుకెళ్తున్నాయి
ఎన్ని సఫల మవుతాయో ?
రంగు రంగు లతలు పెనవేసుకునేసరికి
పచ్చ గడ్డాలు పెరిగిన
ఋషుల తపస్సు భంగమయ్యింది
వసంతమంతా మీ టపా ముంగిట పూదోటగా ఒదిగి పోయిందిగా గురువు గారూ !
ReplyDeleteపరిమళం గారు ధన్యవాదాలు.
ReplyDeleteఆత్రేయ గారు!
ReplyDeleteమీ భావుకత రమణీయం. వసంతాన్ని పిచికారీలో నింపి గుండెల్లో వెదజల్లారు. రంగు రంగుల మాటలతో తెలుగు తోటను పరిమళ భరితం చేసారు. అభినందనలు - డా|| ఆచార్య ఫణీంద్ర
ఆచార్య పణీంద్ర గారు ధన్యవాదాలండి..
ReplyDelete