Friday, March 13, 2009

ప్రశ్నలు


బ్రతుకు పయనంలో..
ప్రతి కూడల్లో, ప్రతి మలుపులో..
అలసి ఆగిన ప్రతి అరుగు మీద.
ఆప్యాయంగా ఆహ్వానిస్తాయి .. ఆ ప్రశ్నలు..

కాలం దొర్లినా.. గమ్యాలు దాటినా..
బంధాలు వీడినా.. పంతాలు తీరినా ..
ఓడి నిలిచిన ప్రతి తరుణంలోనూ..
ఆప్యాయంగా ఆహ్వానిస్తాయి.. అవే ప్రశ్నలు..

ఎద్దేవా చేయడానికో..
ఓడావని ఎగతాళిచేయడానికో
ఓర్పేవయిందని అడగడానికో కాదు..

ఎదురీదే సాహసముంటే
సముద్రమైనా పిల్ల కాలవేననీ
పరుగులు తీసే సత్తా ఉంటే
నీ పాదాల కిందే ప్రపంచమంతా అనీ

ఊతమివ్వడానికే..
నీ ఊహ నిజం చెయ్యడానికే...
తిరిగి నీ పయనం సాగడానికే..
చివరికి గమ్యం చేరడానికే !

శివ చెరువు గారి కవిత "చివరికి " -- http://gurivindaginja.blogspot.com/2009/03/blog-post.html -- కి నా స్పందన

3 comments:

  1. adbhutamaina spandana aatreya gaaru! :)

    ReplyDelete
  2. నిన్ను నీవు గుర్తించడానికే
    విఙ్ఞానం పెంచడానికే
    జగతిని వెలిగించడానికే
    ఎదురొస్తాయి ప్రశ్నలు

    అవునా గురువు గారూ!

    ReplyDelete
  3. monkey2man and శృతిగారు మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.

    ReplyDelete