Thursday, March 5, 2009

హాయి - 2


తోడుగున్న బాధలన్ని పలచనై పోయె నేడు
గోడుజెప్పి మబ్బులన్ని కరిగి జారిపోయి నట్టు
కలల్లోని కతలు అన్ని కవితలయ్యి కదిలె నేడు
వాన బోగ పిల్లగాళ్ళు నీళ్ళలోకి ఉరికి నట్టు

నింగిలోని చుక్కలన్ని కళ్ళలోన మెరిసె నేడు
దాలిగుంట తిరిగి రగిలి చీకటింట ఎగిరి నట్టు
ఇంద్ర ధనసు క్రింద దూకి పెదవిపైన నిలిచె నేడు
రంగు కుంచె సూరిగాడు తూర్పుదిక్కు విసిరి నట్టు

చెలియ నవ్వు మోము చూసి మనసు ఊయలూగె నేడు
గాలి ఈల పాట వింటు పంటచేలు ఊగి నట్టు

10 comments:

  1. కోతినుంచి మనిషిగారు నా బ్లాగుకి స్వాగతం. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  2. ఆత్రేయగారు, నాకు మీకవితల్ని సూసిన ప్రతిసారీ నాకవితలు నచ్చకు౦డాపోతాయేమోనని ఓ భయ౦. బహుశా మీరన్నట్టూ, నావి పదాల కవితలైతే మీవి కేవల౦ భావాల కవితల౦డీ. నమ్మితీరాలి మీరు. ఇప్పటి వరకు మీరు రాసిన అన్ని కవితల్లో నాకు విపరీత౦గా నచ్చి౦ది ఇదేన౦డీ. మీవల్ల కాద౦డీ కవితలు రాయడ౦. నిజ౦గా మీకు రాదు. దీన౦త అ౦దాన్ని సృష్టి౦చగలిగే అద్భుతమైన కవితని మళ్ళీ రాయడ౦ మీవల్ల కూడా కాదు అని నా ఉద్దేశ్శ్య౦.
    స౦గీతభా౦డాగారమున్నవారికి మీనిధిని చూపిస్తే, మిమ్మల్ని ఆస్థాన కవితారయుడ్ని చేస్తార్౦డోయ్.

    మీ కవన౦, పదాల చలన౦, మాటల గమన౦,
    మలయమౌరుత౦, అదో యాగఫల౦, మీరు చేసుకున్న పుణ్య౦.

    కాని భావావేశపుకవితా మహావృక్షానికి మీకూ ఏదో స౦బ౦ధ౦.
    మీరు ఆవృక్షానికి బీజమా, పుష్పమా, లేక ఫలమా?

    ReplyDelete
  3. ఆత్రేయగారు, ఇ౦తకీ ఓ హగ్గీమన్నారు పుత్రవాత్సల్య౦తో పైగా. అన్యాయ౦ సార్. ఈ బ్రహ్మచారిబ్రతుకులో ఉన్న ఈ కుర్రాణ్ణ్ణి ముసలాణ్ణి చేసి అ౦దుకోలేన౦త మళ్ళీ దిగలేన౦త ఎత్తులో విసిరేస్తున్నారు. ఇ౦తకీ మనిద్దరిలో పుత్రుడెవరనుకోమ౦టారు? అ౦దుకో౦డి నా కౌగిలి౦తకు ఓ జోత ఉచిత౦గా.

    ReplyDelete
  4. ఆనంద్ గారు ధన్యవాదాలు. "దీన౦త అ౦దాన్ని సృష్టి౦చగలిగే అద్భుతమైన కవితని మళ్ళీ రాయడ౦ మీవల్ల కూడా కాదు అని నా ఉద్దేశ్శ్య౦. " -- అంత ఆనందం కూడా మళ్ళీ రావాలి గదండీ. అది కలిగితే మళ్ళీ ఇలాంటిదే మరోటి పుడుతుందేమోచూడాలి.. రాయగలగటం పుణ్యం కావచ్చు.. కానీ.. నేరాసిన ప్రతి భావాన్నీ అనుభవించడం మాత్రం నిజంగా నరకమే.. ఇక భావావేశపువృక్షానికి నేనేంటని అడిగారుగా.. ఏమో పండి రాలిన ఆకునో ! ఏండి ఊగే కొమ్మనో ! మొండిగా చిగురుకోసం చూసే మానునో.. తెలియదు.

    ReplyDelete
  5. మీరు ఏదైనా, మహావృక్షాన్ని చూసి మరో వృక్ష౦గా వెలియగలిగే సత్తా ఉన్నవారు.

    ఇ౦దాక నేను రాసిన వ్యాఖ్యలో పొరపాటున కవితారాయుడ్ని అని రాయబోయి కవితారయుడ్ని అని రాసేసాను. క్షమి౦చాలి.

    ReplyDelete
  6. వాడిగల వడుగు మీరే.. వేడివీడినవాడిని నేనూ.. అందుకే మిమ్మల్ని చిన్నవాడిగానే సంబోదించాను.

    ReplyDelete
  7. అయో దానికే క్షమాపణలు ఎందుకండీ.. టైపాటులు మామూలేలేండి.

    ReplyDelete