కన్న కలలీడేరుతాయని తెల్లవారే ఘడియ లాయెని
తల పాపట సింధూరాలద్దగ దినకరుడొచ్చు వేళాయెనని !!
నల్ల నింగి, వెన్నెల వెలుగులో
చల్ల చంద్రుని అద్దం ముందు
మబ్బు తెరల వెనక సద్దుచేయక
చుక్కల మెరుగులద్దు కుంటూ
సోయగాలు సరిదిద్దు కుంటుంది ! .. కన్న ...
రవి ఎరుగని తన అందాలను
కలువ కన్నుల ప్రాంగణంలో,
అల్లలాడే నల్ల కురులతొ,
పెళ్ళి సిగ్గులు మొగ్గ తొడగగ
చల్ల గాలులు సలుపు తుంది ! .. కన్న ...
తూర్పు కొండపై చూపు నిలిపి
ఓర్పు తనలో సడలు తున్నా
రేపటుదయపు ఘడియకోసం
రగులే ఆశమంటలు సాక్షిజేసి
ఎదురు చూపుల పోగులేస్తుంది ! .. కన్న ...
నా గుండెల్లో గిలిగింతెడుతూ
చుట్టు తిరుగుతూ గారం పోతూ
పాట కట్టమని మారం చేస్తూ
ఆశగ చూస్తూ నిలిచిందా నల్లాకాశం ! .. కన్న ...
పాట బావుంది .మరి ట్యూనో ..... పాడేవారో .......మరి అవికూడా పూర్తి చేసి వినిపించరా గురువుగారూ !
ReplyDeleteఆత్రేయ గారూ మీ కవిత బాగుంది. కానీ ఆ ఫొటో కాస్త అభ్యంతర కరంగా అనిపిస్తోంది. అంత అవసరం లేదేమో...
ReplyDeleteనేను మీ బ్లాగు మీది అభిమానంతో నాకు తోచింది చెప్పాను. అన్యధా భావించకండి.. :)
చిత్రాన్ని మార్చాను.. మీ అభిప్రాయానికి ధన్యవాదాలు
ReplyDeletethank you for changing the image
ReplyDeleteప్రేమికుడుగారు, శృతిగారు సదభిప్రాయంతో సూచనలిచ్చి నందుకు ధన్యవాదాలు.
ReplyDelete