Tuesday, February 3, 2009

ప్రతిదిన భాగోతం

తెల్లారిన తొందరలో
తూర్పు కొండల మీద చంద్రుడు,
అలసిన కళ్ళతో తన్నిన సింధూరం !

రేరాజు వీడిన విరహంలో, ప్రకృతి
జార్చిన చీకటి వలువలు -
కనుల ముందు పరిచిన అందం !

తనని కాపాడే గడబిడలో,
నేల కప్పిన పొగమంచు తెరలు
హరితాంకురాలపై రాలి పడిన
స్వేద ముత్యపు బిందువులు ..

చెలికాడి వత్తాసుగా కన్ను గీటిన తారలు.

వీరి శృంగారం పగలై గుప్పుమంది
అందుకే సూర్యుడు మండిపడుతున్నాడు

చంద్రుడు కనబడకుండా
తారలతో కలిపి ఖైదు చేశాడు
పొగమంచు తెరలు దాచేశాడు
ఒలికిన సింధూరం తుడిచేశాడు
దొరికిన సాక్ష్యాలు సర్దుకుంటున్నాడు

ఎవరికి విన్నవిద్దామనో
ఈ తోడుదొంగల ప్రతిదిన భాగోతం

tellaarina tondaralO
tuurpu konDala miida candruDu,
alasina kaLLatO tannina sindhuuram !

rEraaju viiDina virahamlO, prakRti
jaarcina ciikaTi valuvalu -
kanula mundu paricina andam !

tanani kaapaaDE gaDabiDalO,
nEla kappina pogamancu teralu
haritaankuraalapai raali paDina
svEda mutyapu binduvulu ..

celikaaDi vattaasugaa kannu giiTina taaralu.

viiri SRngaaram pagalai guppumandi
andukE suuryuDu manDipaDutunnaaDu

candruDu kanabaDakunDaa
taaralatO kalipi khaidu cESaaDu
pogamancu teralu daacESaaDu
olikina sindhuuram tuDicESaaDu
dorikina saakshyaalu sardukunTunnaaDu

evariki vinnaviddaamanO
ii tODudongala pratidina bhaagOtam

3 comments:

  1. నిత్యకృత్యాపరాదములు ఇంకొన్నింటిని కనబరిచిరికదా మీ తోడుదొంగల భాగొతములో. బహుబాగున్నది మాస్టారు.
    మీ కవితలయందు మక్కువెక్కువై బహు ముచ్చటగావున్నది చదువుతున్న ప్రతిసారి ఒక కొత్త గిలిగింత.
    తెలుగువాడికి నిత్యనూతనోల్లాసబరితమ్ మీ ‘నా కవితలు’.

    ReplyDelete
  2. ఆలోచన బాగుంది. బా చెప్పావన్నయ్యా. :)

    ReplyDelete
  3. వర్మ గారికి, వంశీ గారికి ధన్యవాదాలు.
    ఏమిటో ఈ మధ్య మా అరుగు మీద జనాలే రావటంలేదు. కచేరీలెట్టటంలేదు. పోనీలే ఏమైనా, కాఫీలు అందించే పని తప్పిందని మా ముసల్ది పొద్దున సణుక్కుంటుంది. అదీ ఒకందుకు మంచిదే !!

    ReplyDelete