స్నేహమిదని మభ్య పెట్టుకుంటూ
నువ్వు నేస్తమని .. సద్ది చెప్పుకుంటున్నా
గుండె గుడిలొ దాచుకుంటున్నా..
అందుకే..
నీకై వేచిన ఆ ప్రతి క్షణాలు..
నేచేసిన కాలక్షేపమనుకుంటున్నా ..
స్థంభించినా సమయంలో
రాలిని ఆరెండు చుక్కలు..
కాకతాళీయ మనుకుంటున్నా..
నువు కనపడనప్పుడు,
మెలికలు తిరిగిన మనసు మధనను
వెర్రి తనమని సమాధానపడుతూ..
బరువు పెరిగిన ఆ రెప్పల భారం
అనాలోచిత మనుకుంటున్నా..
నీ మాటకోసం పడె తపనను
పిచ్చితనమని పెదవి విరుస్తూ
నా మాటల గారడీలో
నలిగిన నిజాలనేరుకుంటూ..
ఎదురు చూపుల్లో ఎండి వాలిన
రెప్పలు, రాలకుండా సంభాళిస్తున్నా..
ఒంటిచేతి చప్పట్లకు ఆవురావురని
ఎగిరొచ్చే ప్రతిధ్వనులని ఆస్వాదిస్తున్నా ..
గుండె గుడిలో వెలిసిన హితకు,
ఆహ్వాన సింహాసనాలు..
ఆడంబర ఆఘ్రాణలు..
ఆశ నివేదనలు..
ఆనంద నీరాజనాలు..
అశృ తర్పణాలు..
ఆకాంక్ష అంపకాలు ..
ఆత్మీయతా నిరీక్షణలు..
Chaala baagaa chepparu. Baavundi..."aatmiiyataa niriikshaNalu".
ReplyDeleteవర్మ గారు ధన్యవాదాలు.
ReplyDeleteచాలా చాలా బావుంది. ఇది అందరి జీవితాల్లో ఎపుడో ఒకప్పుడు జరిగే వుంటుందా? ప్రస్తుతం నా పరిస్థితి ఇలానే వుంది.
ReplyDelete"ఒంటిచేతి చప్పట్లకు ఆవురావురని
ఎగిరొచ్చే ప్రతిధ్వనులని ఆస్వాదిస్తున్నా .. " superb!!!
అద్భుతం అండి...
ReplyDelete