Thursday, February 26, 2009

అందనంత ఎత్తులో...


నువు నన్ను తేరిపార చూసి
మనసారా మాటలాడి
పలకరింపుగా నైనా ఒ నవ్వు విసిరి
ఎన్నాళ్ళయ్యింది ?

remember those days ?
మనం hours together మాట్లాడుకున్నప్పుడు
time ఎలా పరుగెడుతుందని
నివ్వెర పోయిన రోజులు..

ఇవాళ best day నా జీవితంలో
అని మురిసిపోతూ.. ఆ evening
ఇళ్ళకు పోతూ.. bye bye
చెపుతూ చూసిన చూపుల లోతులు...

lunch timeలో ఎందెచ్చావు
అంకుంటూ.. ఎలా చేశావనుకుంటూ
ఇద్దరం share చేసుని తింటూ
హాయిగా గడిపిన dayసూ ...

నువ్వెక్కడున్నావ్‌ ?
office కెన్నింటికి వస్తావంటూ
ఓ చేత్తో drive చేస్తూ
మరో చేత్తో phone చేసిన రోజులు ..

ఏమయ్యాయి అవన్నీ..
ఆ friendshipకేమయ్యింది ?
what happened to that ఆత్మీయత ..

తప్పు నాదేలే
మనసు విప్పకుండా ఉండాల్సింది
మాట గుండెల్లో బంధించాల్సింది
కానీ అప్పుడది cheeting కాదూ ?

అందుకే అనుకున్న వన్నీ చెప్పేశ
ఆశల గాలిపటం ఎగరేశా
నిన్ను బాధ పెట్టనన్న బాధౌన్నా
మభ్య పెట్టలేదన్న తృప్తుంది
అర్ధం చేసుకోగలవన్న నమ్మకముంది


చివరగా ఒక్క మాట
..
..
ఏమీ లేదులే..
..
..
ఉన్న దూరాన్ని పెంచుకోలేను.
ఆశ కాగడా ఆర్పుకోలేను.

నా గుండెలో నీ స్నేహానికి
స్థానం అలానే ఉంది.. ఉంటుంది
అందనంత ఎత్తులో...
ఆరాధ్య ప్రాయంగా .

6 comments:

  1. ఆంగ్ల పదాలు వాడకుండా మొత్తం తెలుగు పదాలే వాడి ఉంటే భావం మరింతగా చొచ్చుకుపోయేదేమో?
    ఏదేమైనా, కవిత బాగుంది. ఆగకుండా చదివేలా చేసింది.

    ReplyDelete
  2. ఫణి గారు ధన్యవాదాలు. వచ్చిన భావాన్ని వచ్చినట్టు రాయడం వల్ల అలా జరిగింది. భాషవెదుక్కునే లోపల భావం ఎగిరిపోకుండా అలా బంధించాల్సి వచ్చింది. అలంకారాలు కరువయ్యే నిజజీవిత భావాలకి, ఇలాంటి మసాలాలు తగిలితేనే రుచికరంగా ఉంటుందేమో. మీ అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పినందుకు అభినందనలు, ధన్యవాదాలు.

    ReplyDelete
  3. Oh! why to remember?
    మర్చిపోతే కదా?
    Time పరుగెడుతుంది
    నీతో పోటీ పడుతూ

    నువ్వెక్కడున్నావ్‌ ?
    అని నువ్వడగటం
    lunch timeలో ఎందెచ్చావు
    అని అడిగిన క్షణాలు
    still I could feel.

    ఓ చేత్తో drive చేస్తూ
    మరో చేత్తో phone చేస్తుంటే
    ఏ ప్రమాదం వస్తుందో అని
    భయపడినప్పటి నా heart beat

    అది మాత్రమే నిన్ను చేరలేదు
    ఆత్మీయత లేదని Why do you think?
    మరిచిపోలేని friendship అని నీకు
    confidant లేదా ఏంటి?

    నమ్మితే మరి ఈ questions ఏంటి?
    around you పరిభ్రమించే
    నా మనసు ఊసులు వినబడ లేదా?
    దూరమెప్పుడూ లేదు, its true.


    అందనంత ఎత్తులో అని
    I won't feel, చేయి జారని
    నేస్తం నీవని నా faith మరి
    మనకోసం always నేనున్నాను Friend.


    మన్నించాలి గురువు గారూ,
    వద్దు వద్దని నేను చెప్తున్నాను అయినా వినకుండా వ్యాఖ వ్రాసేసింది మనసు. మన్నిస్తారు కదూ! అందుకే ఇది మాత్రం గుమ్మడి కాయ కాదు. నిఝ్జెం....గా నిజం.

    ReplyDelete
  4. ఆత్రేయ గారికి కూడా love failuraaa!!!! :-(

    ReplyDelete
  5. అందమైన చిత్రం మీ" కంద కదంబం "లోనేనా ...."నా కవితలు" లో కూడా ఉంటే బావుండేదనుకున్నా ....చూడగానే
    సర్ ప్రైజ్ అయ్యాను .అద్భుతమైన మీ కవితలకు కొత్తందాలు అద్దినందుకు అభినందనలు .

    ReplyDelete
  6. మనసుని వారించావా ఆయ్ !!అంమ్మా.. !! .. ఐనా మంచి పనే చేసిందిలే ! నిజమే గుమ్మడి కాయ కాదు. నోటి నిండా మైసూరుపాకు కుక్కినంత కేక !! చాలా బాగుంది శృతిగారు మీ స్పందన. నిఝ్ఝంగా నిజం. ధన్యవాదాలు.

    పిచ్చబ్బాయి గారూ చాలారోజులకు ఇక్కడ కనబడ్డారు. లవ్వు ఐనా స్నేహమయినా failura వవండీ.. నిలుపుకోలేమ మనమే fail అయ్యేది. ఐనా అలాటిది ఏమీ లేదు. గుండెల్లో బాధ చెప్పుకోవటానికి అన్తకు ముందు దగ్గర ఉన్న స్నేహం ఇప్పుడు లేకపోవటమే దీనిలోని భావం. ధన్యవాదాలు

    పరిమళంగారు.. నాబ్లాగులోనూ ఇంతకు ముందు చిత్రాలు ఉండేవి. టెంప్లేటు మార్చడంవల్ల ఎగిరిపోయాయి. 250 పైన కవితలకి మళ్ళీ అవన్నీ వెతికి పెట్టడం చాలా పెద్ద పని అందుకని విరమించు కున్నాను. ఇకపై కొత్త వాటికి పెడదామని మళ్ళీ మొదలెట్టాను.

    అన్నట్టు చెప్పడం మరిచాను. నేను పెట్టే చిత్రాలలో కూడా ఒక సందేశం .. ఒక శీర్షిక.. ఉంటుంది. పైన కనిపిస్తున్న పువ్వు పేరు ఏమిటో చెప్పండి? ..that is a message itself .. idO clue... మీకో పజిల్ అన్న మాట.

    ReplyDelete