Sunday, January 25, 2009

మబ్బు దిండు చిట్లి నట్టు పత్తి పూల వాన నేడు

మబ్బు దిండు చిట్లి నట్టు పత్తి పూల వాన నేడు
వెన్న ముద్ద లెన్నో పూసె చెట్టు కొమ్మ లన్ని చూడు

వెన్నె లంత గుట్ట పోసి మిన్న కుండె నింగి రేడు
చల్ల దూది పింజ తోటి ఆట లాడె పిల్ల గాడు
అమ్మ చేతి చల్ది ముద్ద లోక మంత పెద్ద దయ్యె
నోట బెట్టి మింగ బోవ మాయ మయ్యె నేమి చెప్ప .. !! మబ్బు దిండు

వాడి బుగ్గ పూలు పూసె చేతి వేళ్ళు వంగి పోయె
ముక్కు ధార కారు డాయె నోటి పొగల ఆట లాయె
మంచు బంతి చేసి వాడు ఇళ్ళ పైకి రువ్వు డాయె
పిల్ల గుంపు లన్ని జేరి మంచు బొమ్మ చెక్కు డాయె .. !! మబ్బు దిండు

నేల బడ్డ వెన్నె లంత కాస్త కాస్త మాయ మైతె
చంటి గాడి కళ్ళ లోన పొర్లు కొచ్చె బాధ వాన
కారు ముక్కు పీల్చు కుంటు బుంగ మూతి పెట్టు కుంటు
ఎర్ర బుగ్గ మీద కారు వాడి గోడు చూస్తు ఉంటే ..

సంధ్య పొద్దు తోట లోన ఎర్ర మొగ్గ చెంప మీద
ముత్య మోటి వచ్చి నిల్చి ముద్దు పెట్ట మన్నట్టుండె ..!! మబ్బు దిండు

8 comments:

  1. పాటచదవగానే పెదవులు పక్కున నవ్వాయి.
    చెంపపైన చిన్నగా చిగురించింది చిరునవ్వు.

    ReplyDelete
  2. pruthvi garu cheppinattugane navvu vachindi. chirunavvu vachindi. chala bavundi annaya.

    ReplyDelete
  3. మబ్బు దిండు చక్కగుంది,
    మనసునేమొ మురిపించింది.

    ReplyDelete
  4. పాట లా పాడుకోవటాని భలేగా ఉందే.

    ReplyDelete
  5. సెబాసు.
    ఓపెనింగు లైను సూపరు

    ReplyDelete
  6. వర్మ గారు చిగురించిన నవ్వులు చెరపకండి పూసి విరిసే దాకా ఉండనివ్వండి. ధన్యవాదాలు
    కామేశ్వర రావు గారు, కృష్ణ గార్లకు ధన్యవాదాలు
    అశ్విని గారికి నా బ్లాగుకి స్వాగతం. మబ్బుదిండు మంచి సుఖాన్నిచ్చిందని చెప్పినందుకు ధన్యవాదాలు. హంసతూలికా తల్పాలు, కధలు చెప్పే సాలభంజికా శోపానాలు ఉన్నాయేమో నాబ్లాగులో వెతకండిమరి.
    బాబా గారు ధన్యవాదాలు.

    ReplyDelete
  7. కొత్తపాళీ గారు మీవంటి పెద్దలు ఇలా ఒక లైనులో సెబాసనేస్తే శిష్యులు నేర్చుకునేదెలా ? ఐనా మీరు ఇటువచ్చి భేషన్నారు అదే చాల్లేండి. ధన్యవాదాలు

    ReplyDelete