Monday, January 26, 2009

ఉదయం

తూర్పు కొండల మీదనించి కాంతి తీగల గాలమేసి
నిద్ర లేచిన పగలు, రాత్రి దుప్పటి లాగుతుంటే
ఒళ్ళుమండిన సూరీడు బద్ధకంగా నిద్ర లేచి
తన కోపము నింగి నిండా పరిచినట్టున్నాడు
భయపడ్డ పొద్దుతిరుగుడు చేలు నిక్కబొడుచుకున్నాయి
గువ్వ పిట్టలు గూళ్ళనొదిలి తుర్రు మన్నాయి
అది చూసి తోటలో పూలన్ని గొల్లు మన్నాయి

ఉదయం

6 comments:

  1. కవిత బాగుంది

    పొద్దుతిరుగుడంటే ఎప్పుడో వ్రాసుకొన్న చిన్న కవితముక్క :-)

    పొద్దు తిరుగుడు పువ్వుకు
    మెడపట్టేసిందట.
    ఇట్టే అయిపోయే
    శీతాకాల పగల్ల్లు మరి.

    ReplyDelete
  2. గొల్లు మన్న పూల తావి
    మా వరకూ వ్యాపించె
    మా మదిని మురిపించి ,
    మనసంతా దోచేస్తే ......
    తెలుపుటెట్లు గురువుగారూ ?
    మీకుమల్లె కవిని గాను !

    ReplyDelete
  3. నా తెలుగు ఇంత అందమైందని , ఇలంటి కవితలు చదివినప్పుడు అనిపిస్తుంది.
    చాల బాగ వ్రాసారు
    సంతొష్

    ReplyDelete
  4. వంశీ, బాబాగారు, పరిమళం, సంతోష్, సాయికిరణ్ గార్లకు ధన్యవాదాలు

    ReplyDelete