ఒకే దారిన పోతున్నాం
బ్రతుకు మూట భుజానేసుకుని
ఆశ వెలుగులో దార్లు వెతుకుతూ
అడియాశ మలుపులు వెనక వదులుతూ
తిరిగిన దారులు గుర్తు చేసుకుంటూ
ఒకే కాలాన్ని గడుపుతున్నాం
మన గతపు గంపల గాధలు పంచుకుంటూ
కొత్త కధలను అల్లుకుంటూ
తడబడు నడకలు సవిరించికుంటూ
ఒకరికి ఒకరు ఆధార మవుతూ
ఈ బంధానికి పేర్లు వెదికి
ఓడిన వారెందరో,
అలిసి ఆగిన వారెందరో
పేరు పెట్టి విరిగిన వారెందరో
పిలిచి దాని విరవటమెందుకు ?
మన బంధానికి పేరులొద్దు
ఒకరికి ఒకరు తోడుగా
ఎవరి గమ్యం వారు చేరుకుందామా ?
ఇలా కలిసి తిరిగిన అపరిచితులుగానే సాగి పోదామా ?
చివరికి మన గతాల్లోనే మిగిలి పోదామా ?
సమసి పోదామా ?
అర్థం అయ్యేవరకు అందరమూ అపరిచితులమేనేమో!
ReplyDeleteఅవసరం తీరేవరకు ఆదారిలో అందరం పరిచితులమేనేమో!
ఆశల వెలుగులో అలిసి ఆగి వెతుక్కున్నా, అల్లుకున్నా
ఆధారం దొరకగానే మళ్ళీ ఒకరికొకరం అపరిచితులమేనేమో!!
మీ ఈ కవిత టైటిల్ కన్నా కవితార్దం బావుంది. :D
పృధ్వీ గారు చాలా అందంగా చెప్పారు. టైటిల్ ఏమి పెట్టాలా అని చాలా ఆలోచించి ఇక లాభంలేదని అలా డిసైడయా !! ధన్యవాదాలు.
ReplyDelete"మనం మునుపెన్నడోనే పరిచితులం
ReplyDeleteకాలం మిగిల్చిన కలతల్లోనే ఇలా అపరిచితులం
ఇంకోసారి రేపులోకి కలిసి సాగుదామా?
దాన్ని మాత్రమిక గతంలోకి నెట్టొద్దు, మళ్ళీ విడిపోతామేమోనని భయం."
ఎంత లోతైన భావనండి మీది, అంతకంతా మిగిల్చింది అనుభూతి. కానీ మాటలే చాలడం లేదు వ్యక్తంచేయాలంటే. - ఉష
ఉష గారు ధన్యవాదాలు. మీ ఇద్దరి అభిప్రాయాలతో తావొచ్చిన పువ్వులా వెలుగుతుంది నా కవిత
ReplyDelete