Tuesday, January 6, 2009

ఆశ

రాత్రి బ్రతుకు పండినట్లుంది
తన చంద్రుని గుండెకు హత్తుకుని
తానొదిగి తమకంలో నిద్దరోతుంది

ఇటు చూడు వేదన బల్లమీద
ఆశ ఒంటరై ముఖం దాచుకుని
ఏడ్చి అలిసి బేలగా ఒదిగి కూర్చుంది

తోడు దొరకని ఆశకు ఈడు జారింది
నీ జాడ కానక తాను గోల చేసింది
నీడతోనే తన గోడు చెప్పుకుంటుంది

పండి రాలిన కలలు ఏరుకుంటూ
ఆశమంటకు చితుకులుగా వాడుకుంటూ
ఆరకుండా దాన్ని చూసు కుంటుంది

తెల్లవారే లోపు
కలలు సమసే లోపు
ఆశ ఆరేలోపు
నెగడు అణిగేలోపు
ఆశ పండేనో అడియాసై మండేనో

ee raatri bratuku panDinaTlundi
tana candruni gunDeku hattukuni
taanodigi tamakamlO niddarOtundi

iTu cuuDu vEdana ballameeda
O aaSa onTarai mukham daacukuni
EDci alisi bElagaa odigi kuurcundi

tODu dorakani aaSaku eeDu jaarindi
nee jaaDa kaanaka taanu gOla cEsindi
neeDatOnE tana gODu ceppukunTundi

panDi raalina kalalu ErukunTuu
aaSamanTaku citukulugaa vaaDukunTuu
aarakunDaa daanni cuusu kunTundi

tellavaarE lOpu
aa kalalu samasE lOpu
aa aaSa aarElOpu
aa negaDu aNigElOpu

aa aaSa panDEnO aDiyaasai manDEnO

3 comments:

  1. "పండి రాలిన కలలు ఏరుకుంటూ
    ఆశమంటకు చితుకులుగా వాడుకుంటూ"
    ఆత్రేయ గారూ ! అధ్బుతంగా వుందండీ.

    ReplyDelete
  2. పరిమళగారితో పాటు నేను కూడా సై అంటున్నాను...

    ReplyDelete
  3. పండి రాలిన కలలను ఏరుకో
    ఆశ మంటకు చితుకులుగా వాడుకో
    నీడనై నే నిను చేరు వరకే అంటూ
    బ్రతుకు పండగ నీ జాబిలొచ్చింది
    గండె వాకిట చేరి నిలుచుంది
    తోడుగా తన జోడుగా నీ సమ్మతడిగింది
    చెమ్మ గిల్లిన కనులతో చేయి చాచింది

    ReplyDelete