Monday, January 5, 2009

దారి చూపు

అలిగిన చెలి కన్నుల మంటలోర్చగ వచ్చు
విరిగిన తన పల్కుల ముత్యాలేరగ వచ్చు
బిగిసిన నులి పెదవులు తంటాలు తెచ్చిపెట్టె
ఇరువురు సతులతో నెగ్గిన ఈశా దారి చూపు?

3 comments:

 1. అలిసిన నీ మనసు చూపు,
  సొలసిన నీ తనువు పరచు,
  పిలిచిన నీ గుండె చూపు,
  విడివడదా తన మౌనం తటాలున?
  పరుగిడదా పార్వతి తన నాథుని చేరగ?
  ప్రవహించదా వడివడిగా మందాకిని సురగంగై?
  చూపుల సమ్మొహనంగా, నీ ఎదుదుచూపులు తరిమేయంగా?

  ReplyDelete