శ్వాస
-----
చల్లగా నాలోకి జారుకుంటుంది
చేరి ఉపశమిస్తుంది
చలికాగి చిన్నగా పారిపోతుంది
రోడ్డు
-----
అడుగులు మోసుకుంటూ
నిశ్చలంగా సాగుతుంది
ఆనందంగా ఓలలాడుతుంది
కవిత
----
కళ్ళలోకి దూరిపోయి తన
అందాలను గుండెల్లో చూసుకుంటుంది
స్పందించి కాగితంపైన ఆడుకుంటుంది
సూరీడు
----------
మునివేళ్ళతో గిచ్చి లేపుతుంటాడు
తలుపు సందులోనుంచి జారుకుంటాడు
లేచి చూసే సరికి మండుతున్నాడు
ఈ హైకూలు, కవితలు చూసాక మనసు, ముచ్చుకోతి మునగచెట్టు ఎక్కినట్టు అయ్యింది కాబట్టి, ఇంతటితో యే బ్లాగులో అయినా నా కామెంట్ల పర్వానికి శాశ్వత వీడ్కోలు పలకడమయినది...
ReplyDeleteవెల్లవేసిన గోడ తెల్లగా ఉంటే, ఐరావతం కూడా తెల్లగా ఉన్నట్టే...మరి "వేలుపులగిడ్డి" ని "వేలు పులగిడ్డి" చేసి దీని అర్థం ఏమిటి అని ఒకాయన అడిగితే వచ్చే సమాధానం ఏమిటి ?..(ఒక చిన్న మాట - గిడ్డి అంటే అచ్చతెనుగులో "ఆవు" అండోయ్)
చివరి మాట ఆత్రేయ గారూ, మీ అసలు పేరు నాకు తెలియకపోయినా, మీతో పరిచయం లేకపోయినా, మనఃస్ఫూర్తిగా చెపుతున్నా - మీకు నిజంగా మంచి ప్రతిభ ఉన్నది, వృధా చేసుకోకండి...
అయిపోయింది....ఇంతటితో ఆశ్వాసాలన్నీ సమాప్తం...సర్వేజనా స్సుఖినోభవంతు (సర్వే జనా సుఖినో భవంతు కాదు, కాదు, కాదు....) "సర్వేజనా స్సుఖినోభవంతు" ని ఇంకెలా వ్రాసినా ....ఇంతే సంగతులు చిత్తగించవలెను
వంశీ గారు మీరు కామెంట్లు కొనసాగించననటం కాస్త బాధ గానే ఉంది. ఎన్దుకో అవి పూర్తిగా అర్ధం చేసుకోగల స్థోమత లేకపోయినా, ఎంటో తెలుసుకోవాలన్న ఆత్రుత పెంచుతాయి.
ReplyDeleteమీరు ఇచ్చిన సలహాకు ధన్యవాదాలు.
ఒకదాన్ని పొగిడితే ఇంకొకటి చిన్నబోతుంది....
ReplyDeleteఅందుకే దేనికదే బాగుంది......
వంశీ గారు ఇలా కినుక వహించటం ధర్మమా చెప్పండి?
ReplyDeleteమీ ఆశ్వాసాల్ని కొనసాగించాలినదిగా మా ప్రార్ధన.
Acharya Aatreya garu,
ReplyDelete"Sooridu" kavita adirindi. Your poetry has a lot of nativity. I am transfixed by this haiku "Sooridu" .
త్రినాధ్ గారు, ధన్యవాదాలు. నేను ఆచార్య ఆత్రేయ కాదండి. అది నాకూ కలం పేరే. సూరిడు నచ్చినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteపద్మార్పిత, బాబా గార్లకు ధన్యవాదాలు.
బాగున్నాయి
ReplyDelete