Friday, January 2, 2009

నీ పిలుపు

ఏడు జలధుల ఆవల నుంచి
హల్లో అంటూ వచ్చిన పిలుపు
ఎదలో మల్లెలు కురిసేటట్టు
మరువపు తావిని విసిరేటట్టు
గుండెను తాకిన విచిత్ర వైనము
ఒక్క ముక్కలో చెప్పేదెట్లా ?

ఆ ఆనందానికి అవధులులేవు
ఏ కొలతలు దానికి సామ్యం కావు
బాగున్నావా ? ఆ ఒక్క మాటతో

బరువు బంధాలు బద్దలయ్యాయి
కళ్ళు చెమర్చి తేలికయ్యాయి
గుండెలు రెక్కలు తొడుక్కున్నాయి
నీ ఊసులు మనసులో నిండిపోయాయి
కాళ్ళు గాలిలో తేలిపోయాయి
నింగి అంచులు పరిచయమయ్యాయి

కొత్త వత్సర ఘడియలు నన్ను
ప్రేమగా గుండెకు హత్తుకున్నాయి
తడిసిన కళ్ళను వేలితో తుడుచుకున్నాయి



EDu jaladhula aavala nunci
hallO anTuu vaccina pilupu
edalO mallelu kurisETaTTu
maruvapu taavini visirETaTTu
gunDenu taakina vicitra vainamu
okka mukkalO ceppEdeTlaa ?

aa aanamdaaniki avadhululEvu
E kolatalu daaniki saamyam kaavu
baagunnaa ? aa okka maaTatO

baruvu bandhaalu baddalayyaayi
kaLLu cemarci tElikayyaayi
gunDelu rekkalu toDukkunnaayi
nee uusulu manasulO ninDipOyaayi
kaaLLu gaalilO tElipOyaayi
ningi anculu paricayamayyaayi

kotta vatsara ghaDiyalu nannu
prEmagaa gunDeku hattukunnaayi
taDisina kaLLanu vElitO tuDucukunnaayi

5 comments:

  1. పేరులేని నన్ను గుర్తించ గలరని
    చెప్పకుండా వచ్చేసిన అతిధి నేను

    చెప్పాలని ఉంది ఇలా
    పలుకు లోనే
    తేనె మధులు
    గ్రోలిన తుమ్మెదా!

    నన్నేక్కడ
    చూస్తానో అని
    పోటీగా తెచ్చావా
    నీ కళ్ళలోని
    ఆ చెమ్మను
    అని అడగాలని ఉంది

    నీ చెక్కిలిపై
    నా స్పర్శకు
    తెలుసునులే
    ప్రతి చుక్కలో
    మెరిసే నీ హౄదయాన్ని
    చూడటం

    ReplyDelete
  2. నీ పలుకు హిమాలయ శిఖరమై,
    నీ పిలుపు దిగంతాల కాంతి పుంజమై,
    నీ తలపు విశ్వమోహనమై,
    నీ జగత్తు నా లోకాన్ని జయించేస్తూ,
    నాకు నేను మిగలక నీలో లీనమై,
    పలికాను మరో శత ఘడియల ఏటికి,
    వెన్నెల కర్పూర స్వాగతం.

    ReplyDelete
  3. పేరు లేని వారి
    ప్రేమ పలుకులు నన్ను
    నింగి కెత్తి నిజము ఊరటిచ్చే

    ఆ కంటికొచ్చిన చెమ్మ నాతోడుగాదు
    నా పంటిబిగువున వున్న బాధగాధ

    ఆ స్పర్శ కోసమేగా
    కనుల కొలనులు కడిగిన
    వెచ్చని నా చెక్కిళ్ళు

    అతిధి దేవో భవ.

    ReplyDelete
  4. ఉష గారు, చాలా బాగాచేప్పారు మీ స్వాగతం. ధన్యవాదాలు.

    ReplyDelete
  5. శృతి గారు మీ స్పందన బాగుంది. ముసుగులో వచ్చినా మంచి ముచ్చట చేశారు. ధన్యవాదాలు.

    ReplyDelete