Wednesday, October 8, 2008

నీతోనే నా మనసు వదిలి పోతున్నా


గుండె పగిలి పోతున్నా మనసు నలిగి పోతున్నా
కనులు ఒలికి పోతున్నా మనిషి రగిలి పోతున్నా
గొంతు ఆరి పోతున్నా కాళ్ళు వణికి పోతున్నా
నీ కోసం నా దారిని వెదుక్కుంటూ..ఆనందంగా
నిన్ను వదిలి పోతున్నా కానీ నేస్తం
నీతోనే నా మనసు వదిలి పోతున్నా
నడవలేని పాదాలు ఈడ్చుకుంటూ, నా బాటలోని పూలను నీకోసమేరుకుంటూ
కన్నీటిని కొన వేలితో తుడుచుకుంటూ, నీ ఎడబాటును తలుచుకుంటూ
మసకేసిన నా కళ్ళని చివరిసారి బ్రతిమాలుకుంటూ, బ్రతుకీడ్చుకుంటూ
నీ కోసం నా దారిని వెదుక్కుంటూ..ఆనందంగా
నిన్ను వదిలి పోతున్నా కానీ నేస్తం
నీతోనే నా మనసు వదిలి పోతున్నా
భారమైన హృదయంతో వివర్ణమైన వదనంతో
అంతరంగ మంధనంతో బరువైన జ్ఞాపకాల గ్రంధంతో
ఊసులన్నీ పదిలంగా దాచుకుంటూ మరలని నీ తోడు తెలిసీ చేజార్చుకుంటూ
నీ కోసం నా దారిని వెదుక్కుంటూ..ఆనందంగా
నిన్ను వదిలి పోతున్నా కానీ నేస్తం
నీతోనే నా మనసు వదిలి పోతున్నా


gunDe pagili pOtunnaa manasu naligi pOtunnaa
kanulu oliki pOtunnaa manishi ragili pOtunnaa
gontu aari pOtunnaa kaaLLu vaNiki pOtunnaa
nee kOsam naa daarini vedukkunTuu..aanamdamgaa
ninnu vadili pOtunna kaanee nEstam
neetOnE naa manasu vadili pOtunnaa
naDavalEni paadaalu eeDcukunTuu, naa baaTalOni puulanu neekOsamErukunTuu
kanneeTini kona vElitO tuDucukunTuu, nee eDabaaTunu talucukunTuu
masakEsina naa kaLLani civarisaari bratimaalukunTuu, bratukeeDcukunTuu
nee kOsam naa daarini vedukkunTuu..aanamdamgaa
ninnu vadili pOtunna kaanee nEstam
neetOnE naa manasu vadili pOtunnaa
bhaaramaina hRdayamtO vivarNamaina vadanamtO
antaranga mandhanamtO baruvaina jnaapakaala grandhamtO
uusulannee padilangaa daacukunTuu maralani nee tODu telisee cEjaarcukunTuu
nee kOsam naa daarini vedukkunTuu..aanamdamgaa
ninnu vadili pOtunna kaanee nEstam
neetOnE naa manasu vadili pOtunnaa

3 comments:

  1. ఊరుకోండి మాష్టారూ...మరీ....

    పగిలిపోయి, నలిగిపోయి, ఒలికిపోయి, రగిలిపోతూ, ఆరిపోతూ, వణికిపోతూ, దార్లు వెతుక్కుంటూ, పూలేరుకుంటూ, బ్రతుకీడ్చుకుంటూ, కన్నీళ్లు తుడుచుకుంటూ కూడా ఆనందంగా ఉండటం - ఎలా సాధ్యం? పోనీ ఆనందంగా ఉండటానికి మనసు ఒకటి మన దగ్గరే ఏడ్వాలిగా...మీరేమో నేస్తం దగ్గరే వదిలేస్తా అని అంటున్నారు !

    మరి ఎలా...ఆనందం ఎలా....పోనీ గుండెల నిండా ఆననందం నిండి పోయింది అనుకుంటే, అదేమో ముందే పగిలి ఊరుకుంది...పగిలిపోయిన దాన్ని అతికించుకోవడానికి మీరేమో రగిలిపోతూ వణికిపోతూ ఆ పని చెయ్యలేరు, ఎందుకంటే వణుకుతూ బీ.పీ పెరిగి మళ్లీ కింద పడిపోతే మీ మీద మీరేరుకున్న పూలే వెయ్యాల్సి ఉంటుంది - ఎలా సాధ్యం - బాబోయి నా వల్ల కాదు ఈ కవితలు చదవటం....


    just kidding

    ReplyDelete
  2. వంశీ గారు కేక పెట్టించారుగా. సాధ్యం కాదు అంటూనే మొత్తం చదివారుగా అలానే ఇది కూడా సాధ్యమే.

    ReplyDelete
  3. మరీ అలా తీసిపారెయకండి వంశి గారు...
    ఆ బాధ అలాంటిది కావచ్చు. అనుభవిస్తెనే తెలుస్తుంది.

    @రాసినవారు.
    ఒక వెళ ఇది మీ ఆవెదన అయితె...
    మీరు తొందరగా మీ ఙ్ఞాపకాల ఊబి లొ నుండి బయటకి రావాలని కొరుకుంటున్నాను.

    ReplyDelete