Tuesday, December 30, 2008

అనుభవాలు

భావ పాతాలు గుండె శిలలను చేరుకుంటూ
తలలు పగిలేలా మూర్కొంటున్నాయి
బ్రతుకు ఒరవడి తాళలేక పల్లాలని వెదుక్కుంటూ
ఆత్మహత్యను చేసుకుంటున్నాయి

చావచచ్చిన శకలాలు ఉపరితలంపైన ఆడుకుంటాయి
ఏమీ పట్టనట్టు సాగిపోతాయి - నవ్వుకుంటాయి
చచ్చిబ్రతికిన ఆనవాళ్ళు తెట్టుతోడై ఒడ్డు చేరుకుంటాయి
అనుభవాలై గతంలో పొందికగా సద్దుకుంటాయి

జ్ఞాపకాలై మధనపెడుతు విందుచేసుకుంటాయి



bhaava paataalu gunDe Silalanu cErukunTuu
talalu pagilElaa muurkonTunnaayi
bratuku oravaDi taaLalEka pallaalani vedukkunTuu
aatmahatyanu cEsukunTunnaayi
caavacaccina SakalaalE uparitalampaina aaDukunTaayi
Emii paTTanaTTu saagipOtaayi - navvukunTaayi
caccibratikina aanavaaLLE teTTutODai oDDu cErukunTaayi
anubhavaalai gatamlO pondikagaa saddukunTaayi
jnaapakaalai madhanapeDutu vinducEsukunTaayi

4 comments:

  1. Excellent!! maastaru.
    Kavithaa Bhaavalu paathukupothunnnai manassuloa...

    ReplyDelete
  2. గమ్య మెరుగని పయనంలో
    దాటామొక మజిలీ
    తీపి మరిచి ,చేదు విడిచి
    స్థిత ప్రజ్ఞత సంతరించుకున్న ,
    ఈ చివరి రోజు .......
    నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ,
    ప్రార్ధిస్తున్నా..... సర్వే జనాఃసుఖినో భవంతు.

    సర్! నూతన సంవత్సర శుభాకాంక్షలు .

    ReplyDelete
  3. me blog lo telugu words kanipinchatam ledu.mare nakena andareke alane undo teleyadu.

    ReplyDelete
  4. నూతన సంవత్సర శుభాకాంక్షలు..!!

    ReplyDelete