Friday, December 26, 2008

శాంతం

తర్కం వేదం మోక్షం శాంతం
యాగం యజ్ఞం మరణం శాంతం
విరహం తమకం స్వేదం శాంతం
ఆరాటం ఆధారం నిర్వేదం శాంతం
కాంక్ష ఆంక్ష శిక్ష శాంతం
ఆరంభం నిర్మాణం నిర్మూలం శాంతం
జన్మం పోరాటం నిర్మోహం శాంతం

5 comments:

  1. ఎవరో మహానుభావుడు చెప్పినట్టు వృద్ధ్యాప్యపు కర్పూరంలో యవ్వనాగ్నులు దాగి ఉంటాయట..మీరు ఇప్పటికయినా కర్పూరాన్ని హారతి చేస్తే మంచిది ...మంచి రచయిత లక్షణం అది....

    మీకు మంచి ప్రతిభ ఉన్నది...అలా ఉండి కూడా అనవసరంగా కొండకు కొంగులాగా ఉన్న లోయలో ఎవరూ దించలేని మేనాలో కూర్చుంటారెందుకు ఆత్రేయ గారూ? ..

    ReplyDelete
  2. baagundi. `శాంతం` shaanti.

    ReplyDelete
  3. వంశీ గారు :-)

    ఆత్రేయ గారు
    మీ బ్లాగుని నేనెప్పుడు సందర్శించినా నిరాశ చెందను.
    అంటటి సమర్ధులు మీరు.
    జీవనసారాన్ని మధించి మధించి శాంతిచారా ఏమీ? ఇంత మంచి కవితను వ్రాసారు.

    ReplyDelete
  4. kavitha chala chala baagundi aatriya garu.!!

    ReplyDelete
  5. వంశీ , సుజ్జి, వర్మ గార్లకు ధన్యవాదాలు

    బాబాగారు నిరాశ చెందక పోవటం మీ గొప్పతనం. ధన్యవాదాలు. వాక్యాలు రాసి కవితలో భావాన్ని నేను చెప్పే కంటే విడి విడి పదాలతో
    వాక్యాలు రాయకుండా అర్ధాన్ని చదివేవారు ఊహించేటట్లు రాద్దామన్న ఒక ప్రయత్నం ఇది. మీకు కూడా నచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete