Monday, December 29, 2008

వస్తావు కదూ ?

మంచు ముసుగులో వసంతం కోసం
నగ్నంగా తపస్సు చేసే మానులా
ఋతువు ముసుగులో తొలకరి కోసం
ఆబగా ఎదురు చూసే చకోరంలా (/ఆలుచిప్పలా)
నేల ముసుగులో పుఠం కోసం
మకిలిలా ఎదురు చూసే బంగారంలా
ఆశ ముసుగులో నీకోసం
ఉలి తగలని శిలలా ఎదురు చూస్తున్నాను
కాల చక్రం నావైపు మొగ్గదని తెలుసు
ఐనా నీకోసం ఎదురుచూస్తున్నాను
వాటిని చేరిన అచంచల నమ్మకం
నా రెప్పల వెనక నీళ్ళ పొరలా ఆవహించింది
వాటినార్పి ఆశను చెక్కిళ్ళపై జార్చలేను
ఆర్పక నీ రాక మసక చేసుకోలేను
కదలని నా కళ్ళలోగిళ్ళు
సంక్రాంతి ముంగిళ్ళై రంగులమర్చుకుంది
వస్తావన్న ఆశ ఇంకా నా కళ్ళనిండా ఉంది
వస్తావు కదూ ?



mancu musugulO vasantam kOsam
nagnamgaa tapassu cEsE maanulaa
Rtuvu musugulO tolakari kOsam
aabagaa eduru cuusE cakOramlaa
nEla musugulO puTham kOsam
makililaa eduru cuusE bangaaramlaa
aaSa musugulO neekOsam
uli tagalani Silalaa eduru cuustunnaanu
kaala cakram naavaipu moggadani telusu
ainaa neekOsam edurucuustunnaanu
vaaTini cErina acancala nammakam
naa reppala venaka neeLLa poralaa aavahincindi
vaaTinaarpi aaSanu cekkiLLapai jaarcalEnu
aarpaka nee raaka masaka cEsukOlEnu
kadalani naa kaLLalOgiLLu
sankraanti mungiLLai rangulamarcukundi
vastaavanna aaSa inkaa naa kaLLaninDaa undi
vastaavu kaduu ?

8 comments:

  1. మంచి భావాన్ని అందించిన కవిత. ఇలాంటి కవిత చదివి చాలా రోజులు అయింది.
    కాకపొతే కొన్ని సవరణ(?)లు,
    చకోరం చంద్రుని కోసమే కదా ఎదురు చూసేది?
    "వాటిని చేరిన అచంచల నమ్మకం
    నా రెప్పల వెనక నీళ్ళ పొరలా ఆవహించింది"
    ఇక్కడ వాటిని అన్న పదం దేన్ని సూచిస్తుందో అర్ధం కావడం లేదు?
    ఇలా విడదీయకుండా చదివితే చాలా బావుంది. ముఖ్యంగా ఈ రెండు చరణాలు అద్భుతంగా ఉన్నాయి.
    "వాటినార్పి ఆశను చెక్కిళ్ళపై జార్చలేను
    ఆర్పక నీ రాక మసక చేసుకోలేను"

    ReplyDelete
  2. కాల చక్రమే నీ మనసుకు తల ఒంచగా
    నీ ముంగిట రంగవల్లినై రానా!
    అగాధమంత ఆశను నింపుకుని
    ఇలా బేలగా మాట్లాడటం తగునా నీకు?
    నమ్మకమే పునాదిగా అల్లుకున్న
    పొదరింట వేచి ఉంది కదా నీ వసంతం!
    అయినా వినరాదే నీ అడుగుల సవ్వడి
    నిను చేరిన చెలి గుండె సవ్వడి వినలేదేమో మరి

    ReplyDelete
  3. వంశీ, నేస్తం ధన్యవాదాలు

    @ప్రతాప్ గారు, చకోరం చంద్రుని కోసం చూస్తుందనీ చదివాను, తొలకరి చునుకు కోసం చూస్తుందని చదివాను. ఏది తప్పో తెలియదు. ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరన్నా సూచిస్తే, ధన్యవాదాలు. మీరు ప్రశ్న అడిగినందుకు కృతజ్నతలు. ఇక మీ రెండవ ప్రశ్న. 'వాటిని ' అన్నది మాను, చకోరం, బంగారాలను ఉద్దేసించి. ఇవాళ కాకపోతే తరువాత కొంత కాలానికైనా వాటి ఆశలు తీరుతాయి అన్న ధీమా వాటికి ఉంది. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

    @శృతి గారు చాలా బాగుందండి మీ స్పందన. "అగాధమంత ఆశ " అన్న పద ప్రయోగం నాకు నచ్చింది. "అగాధమంతా ఆశ నింపుకుని " అని రాయాలనుకున్నారేమో కానీ యధాతధంగానే బాగుంది. ధన్యవాదాలు.

    ReplyDelete
  4. ఆత్రేయ గారు అద్బుతంగా ఉందండీ కవిత.
    కవిత మొత్తం ఒక రకమైన టెంపోలొ నడచి గొప్ప అందాన్నిచ్చింది.

    ఇక చకోరము అంటే ఒక రకమైన పక్షి, ఇది చంద్ర కిరణాలను తింటుందని, వాటికై ఎదురుచూస్తుందని సాహిత్య వర్ణణలు చేసారు.
    దీనికి అచ్చతెనుగు మాట వెన్నెల పిట్ట.

    తొలకరి చినుకుకై ఎదురుచూసేది స్వాతిముత్యం/ముత్యపుచిప్ప.

    పై రెండు దుష్ట్యాంతాలు సాహితీపరమైనవే తప్ప శాస్త్రీయమైనవి కావు.

    ఇది నాకు తెలిసిన సమాచారం. ఎవరైన మరింత తెలిపినట్లయితే తెలుసుకోవాలని ఉంది.

    ReplyDelete
  5. బాబా గారు ధన్యవాదాలు. ఆలుచిప్పల్ని కవితలో ఇరికించాను

    ReplyDelete
  6. చాల బాగుంది మీ వివరణ.

    ReplyDelete