Wednesday, November 26, 2008

మనసు - కూడలి

ముళ్ళ కంపలా చింపిరి జుట్టు
చేపల వలలా చిరిగిన చొక్కా
స్వాతి ముతియమా చెరగని నవ్వు
ఎండవానలా అతనికి తెలియవు

తరతరాలుగా చెదరని శిలలా
పరిసరాలను వదలక విధిగా
నలుగురు రోజూ నడిచే దారిన
కనపడ తాడో పిచ్చి బికారి

దగ్గరికొస్తే దణ్ణంపెడుతూ
దూరం జరిగితే ముడుచుకు పోతూ
బువ్వను పెట్టే వారికి మనసా
దేవుని పేరుతొ దీవెనలిస్తూ

బాహ్యం అంతరం బేధం లేక
పగలూ రాత్రీ తేడా మరిచి
పరులకు ఎప్పుడు భారం కాక
బ్రతుకును తానే నెట్టే వాడు

అతనికి అందరు తెలిసిన వారే
అతనే ఎవరికి అక్కర లేదు
ఎవరికి ఎవరు ఏమవ కున్నా
చివరికి కాలం కౌగిలి తప్పదు

నేడా భాగ్యం అతనికి సొంతం
ఇపుడా కూడలి మోడుబోయెను
ఎవరికి వారు తేడా చూడక
ఏమయ్యాడని వాకబు చేయక

చేతులు దులుపుకు తిరిగేస్తుంటే
ప్రాణం విలువ తెలియక తిరిగే
వీరి మధ్యన బ్రతుకును నడుపుతు
సిగ్గుతో చచ్చి తల దించేశాను

అక్కడ తేడా చూశా నంటూ
నా కంటి చివరలు చెమరి నప్పుడు
పోయిన ఒంటరి మనిషి కోసమా ?
ఏమీ పట్టని మనుషులు చూశా ?

ఆ ప్రశ్నలు ఇంకా గుండె
లోతుల్లో గునపపు పోట్లై
వేధిస్తూ వున్నాయి నన్ను
వదలక సాధిస్తున్నాయి !!


muLLa kampalaa cimpiri juTTu
cEpala valalaa cirigina cokkaa
swaati mutiyamaa ceragani navvu
enDavaanalaa ataniki teliyavu

tarataraalaku cedarani Silalaa
parisaraalanu vadalaka vidhigaa
naluguru rOjuu naDicE daarina
kanapaDa taaDO picci bikaari

daggarikostE daNNampeDutuu
duuram jarigitE muDucuku pOtuu
buvvanu peTTE vaariki manasaa
dEvuni pEruto deevenalistuu

baahyam antaram bEdham lEka
pagaluu raatrii tEDaa marici
parulaku eppuDu bhaaram kaaka
bratukunu taanE neTTE vaaDu

ataniki andaru telisina vaarE
atanE evariki akkara lEdu
evariki evaru Emava kunnaa
civariki kaalam kougili tappadu

nEDaa bhaagyam ataniki sontam
ipuDaa kuuDali mODubOyenu
evariki vaaru tEDaa cuuDaka
EmayyaaDani vaakabu cEyaka

cEtulu dulupuku tirigEstunTE
praaNam viluva teliyaka tirigE
veeri madhyana bratukunu naDuputu
siggutO cacci tala dincESaanu

akkaDa tEDaa cuuSaa nanTuu
naa kanTi civaralu cemari nappuDu
adi pOyina aa manishi kOsamaa ?
adi paTTani ee manushulu cuuSaa ?

aa praSnalu inkaa gunDe
lOtullO gunapapu pOTlai
vEdhistuu vunnaayi nannu
vadalaka saadhistunnaayi !!

No comments:

Post a Comment