Tuesday, September 29, 2009

దాహం


అనుభవాల శిధిలాలనూ,
గతాన్నీ తొక్కి అందంగా నిలిచిన
సౌధాల మధ్యగా..
అనుబంధాలు అణచి మొలిచిన
వృక్షాల మధ్యగా..

ఆ నీడకు మురిసేదెలా ?
ఈ అందాలను ఆస్వాదించేదెలా ?

ప్రతి మలుపు వేసుకున్న
మేలిమి ముసుగు వెనక
దేనికోసమో వెదికే కళ్ళకు
ఏమి చెప్పను ?

క్రొత్త దారుల్లో..
పాత గుర్తులు దేవుకుంటూ..
నిర్లిప్తంగా..నా పయనం !

ఈ సాగర సరంగు దాహమెప్పటిదో!
తీరమెప్పటికో !!?


9 comments:

  1. మాకు మాత్రం కవిత చదివి దాహం తీరింది :)

    ReplyDelete
  2. చదివాక నేను కూడా జ్ఞాపకాల నీడల్లో కి జారిపోయాను. నిర్లిప్తమైన పయనం లో అందాలను ఆస్వాదించలేను కదా, జీవితాన్ని అలా నడుపుకొస్తున్న వాళ్ళలో నేనూ ఒకడిని.

    ReplyDelete
  3. మనసునుతట్టే ప్రతి సన్నివేశం లోతుగా అందంగా రాసేస్తున్నారు. చాలా బావున్నాయి.
    (చిన్నగా నాకు తోచింది ఇలా,..)
    అనుబంధాల ఆనందం వెనుక
    అనుభవం విప్పే అక్షరాల మధ్యన
    అండగా నిలిచివుండే ప్రేమల ఎత్తులో
    ఆహ్లాదంకోరే పరిశీలన చివరల
    అందంగా ఒదిగిన భావం నీవేననని చెప్పనా..
    వెతికే నీ కళ్లకి,
    వేచియున్న మనసు తెరుచుకునేవున్నదని చెప్పనా..
    పయనం ఎటైనా ఫలితం నీవేనని చెప్పుకోనా..

    ReplyDelete
  4. baagundanDi aatreya gaaru mee kavitha ....

    ReplyDelete
  5. "క్రొత్త దారుల్లో..
    పాత గుర్తులు దేవుకుంటూ.."
    చాలా బావుంది సర్ !

    ReplyDelete
  6. భారారె గారు ధన్యవాదాలు
    వర్మ గారు చాలా మంచి స్పందనను ఇచ్చారండీ. అద్భుతంగా ఉంది. అభినందనలు
    కార్తీక్‌ గారు నెనరులు
    సృజన గారు ధన్యవాదాలు
    పరిమళం గారు మీకు కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  7. "క్రొత్త దారుల్లో..
    పాత గుర్తులు దేవుకుంటూ.."
    పాత నడకలలో కొత్త అడుగులు నేర్చుకుంటు తప్పదు కదండి పయనం మరి..
    బాగుంది కవిత.

    ReplyDelete
  8. భావన గారు ధన్యవాదాలండి.

    ReplyDelete