Friday, May 15, 2009

తనెళ్ళిపోయింది


ఐనా ఈ రాత్రి… అవే ఊసుల్ని
చీకటి పొదల్లో.. ఎక్కడినుంచో
చెపుతూనే ఉంది.

ఆ దారుల్లో నిప్పు రేణువుల్ని
మిణుకు మిణుకు మంటూ
రేపుతూనే ఉంది.

కాసేపు అలా
నేను, రాత్రి, ఏకాంతం.

అసంకల్పితంగా
పచ్చిక మీద వెల్లికిలా.. ఓ కన్ను మూసి
బొటనవ్రేలితో చంద్రుడిని నొక్కుతూ
పక్కనున్న గడ్డి పరకలు
త్రుంచుతూ.. తింటూ..
కాళ్ళను ఆ యేటి నీళ్ళల్లో ఆడిస్తూ..

అన్నీ తీసుకు వెళ్ళిపోయింది..
నన్ను కూడా..

కాలమూ ఆగిపోయింది
సగం పరక నోట్లోనే మిగిలిపోయింది
నిశ్శబ్దం ఆవరించింది.




పొద్దు వారు ప్రచురించిన నా కవిత తనేల్లిపోయింది చూడగలరు .


http://poddu.net/?p=2798

5 comments:

  1. మాటలేవీ జ్ఞప్తికి రావటం లేదు. మనసు మాత్రం మీరు చెప్పిన భావనలో మునిగిపోయింది.

    ReplyDelete
  2. కాలమూ ఆగిపోయింది
    నిశ్శబ్దం ఆవరించింది !
    బావుందండీ !

    ReplyDelete
  3. ఆత్రేయ గారూ,

    పచ్చిక మీద వెల్లికిలా.. ఓ కన్ను మూసి
    బొటనవ్రేలితో చంద్రుడిని నొక్కుతూ

    ఈ పదాలకి
    నా మనసు నిలిచిపోఇంది,
    నిశ్శబ్దం నన్ను ఆవరించింది..!!

    కళ్ళు మూస్కొని ఊహిస్తుంటే...మనసు పులకిస్తుంది ఆ చిత్రాన్ని తల్చుకుని...

    ReplyDelete
  4. ఉష గారు, పరిమళం గారు, సుజ్జి గారు ధన్యవాదాలు.
    నిశాంత్ గారు నా బ్లాగుకు స్వాగతం. మీకు కవిత నచ్చినందుకు ఆనందంగా ఉంది. వస్తూఉండంది. ధన్యవాదాలు.

    ReplyDelete