Friday, May 8, 2009

నన్నెలా అర్దం చేసుకోవాలో ?!



ఎన్ని మాటల తూటాలూ..
నాకు తప్పుకోవాలన్న తలపైనా వచ్చిందా ?
చూశావా ఎన్ని తూట్లు పడ్డాయో..

ఐనా హాయిగా ఉంది...
నా చిన్న తనం గురుతు చేశావు..

కారం తినడంఅన్నా .. కత్తితో ఆటలన్నా
కరెంటు తీగలన్నా.. ఎంత మక్కువో
అమ్మ అన్నిటికీ అరిచేది. కసిరేది..
నాకూ... అచ్చు.. ఇలానే అనిపించేది..

తేడా అల్లా.. నేనప్పుడు అర్ధం చేసుకోవడానికి
ప్రయత్నిచలేదు... సరే అని మిన్న కున్నానంతే..

ఇప్పుడర్ధమయ్యింది..
తను నాకర్ధం కాలేదో...
నేను తనని అపార్ధం చేసుకున్నానో..
ఇప్పుడు రోజూ అనుకుని ఏంప్రయోజనం ?

నాది శిలా హృదయం కాదు .. కన్నా...
ఆ ఆర్ధ్రత నన్ను చేరక కాదు రా...
అవగాహన చేసుకునే వయసు నీకు రాలేదని.

'వద్దు ' అన్న మాటొక్కటే నీకు వినపడేది..
నాకు అదే జరిగితే అన్న ఊహతో పాటు
శతకోటి విషాద గీతాలు..
అనంతకోటి అశ్రు జలపాత ఘోషలూ..

అందుకే.. నీకు నేనంటే భయమయినా..
నువ్వు క్షేమమన్న తృప్తి
అర్ధం చేసుకుంటావన్న ఆకాంక్షతో..
ఇలా కాలం గడుపుతున్నా..
ఆరోజు కోసం ఎదురు చూస్తూ.


శృతిగారు రాసిన http://manaanubhoothulu.blogspot.com/2009/05/blog-post.html కవితకు నా స్పందన.


5 comments:

  1. శృతి కవిత స్పందన భావన అన్(దరు)న్ని బావున్నా(యి)రు :P

    ReplyDelete
  2. ఎంత బాధనైనా మీ కలంతో తుడిచేస్తారు . నెగిటివ్ ఫీలింగ్ నుండి బయటకు తెచ్చేస్తారు !

    ReplyDelete
  3. "మా నాన్న చెప్పిన మాటలు నామంచికేనన్నది నా కొడుకు నా మాటలు అపార్థం చేసుకున్నాకనే తెలిసింది" అని ఒక ప్రముఖ రచయిత మాటని ఈ మధ్యనే అంధ్రజ్యోతి ఆదివారం శీర్షికలో చదివాను. బహుశా నేను ఒకటి రెండూ పదాలు మార్చి చెప్పినా సారాంశం ఇదే.

    ReplyDelete
  4. vamSii gaaru parimaLam gaaru dhanyavaadaalu.

    baabaa gaaru. appreciate you correcting that word. i always thought its aSR.. thanks once again.

    usha gaaru baagaa ceppaaru.. nijamEkadaa.. kaanii manam telusukunE lOpalE kaalaa daati pOtundi.

    ReplyDelete