Wednesday, April 15, 2009

కల(ల )త నిద్ర..


చిక్కటి చీకటి రాత్రి
ప్రశాంతతను ఆశించి నిద్రకుపక్రమించిన కొలను
ఆ పక్కనే పెద్ద మర్రి చెట్టు
దానిని ఆశ్రయించిన ఎన్నో పక్షులు

అవి ఎప్పటినుంచి వేచి ఉన్నాయో
ఆ తరుణం కోసం.. ఎన్ని ఊసులో.. ఎన్ని గుసగుసలో..
గుండె లోతుల్లోనుంచి గుచ్చబడిన
బంధాలు తెగి జారిన ముత్యాల్లా.. సాగుతున్నాయి

ఆ ఊసులాపమన్నట్టు సున్నితంగా..
ఆ కొలను.. మర్రిచెట్టును అలల చేతులతో తడుతుంది..
ముల్లులా దాని మనసు గుచ్చేవి కొన్నైతే
తన నొచ్చులని పువ్వులా తడిమి
దానికి నచ్చేవి మరికొన్ని... ఐనా..

అలసిన కొలను ఆపమంటుంది..
తనకు శాంతి అవసరమంటుంది..
ఐనా.. అవి సాగుతూనేఉన్నాయి ...

3 comments:

  1. అలసిన కొలను ఆపమంటుంది..
    తనకు శాంతి అవసరమంటుంది..


    Atreya gaaru, I madhya mI kavitalu chala miss ayyanu.. malli vacchaanamDoy.

    baagundi saaru.

    ReplyDelete
  2. ఆగని కాలం అదుపుచేయలేం
    వినని మనసు వూసులాపలేం
    రేయి కలల వూయలాపదు
    కాలాలు, వూసులు, కలలు అదుపుచేయలేం
    కనుక ఓ కొలనమ్మా ఇక మము మన్నించేయ్..

    ReplyDelete
  3. బారారె గారు అదే అనుకున్నాను ఏమయ్యారా అని. హమ్మయ్య వచ్చేశారుగా .. ఆనందంగా ఉంది. మీకు కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.

    ఉష గారు ఈ కవితకి శీర్షిక అలా పెట్టకపోతే (చెరువుగట్టు అనో కొలనుకధ అనో పెడితే) ఎలా ఉంటుందంటారు ? ఏమో ఈమద్య నాకవితలు ఇలా రెండు అర్ధాలతో రాస్తే నా మిత్రులకు కొంతమందికి అర్ధంకాలేదన్నారు. అందుకని ఇలా కవితకి, శీర్షిక పెట్టాను (నాకు కాస్త ఇబ్బంది ఐనా..)

    ReplyDelete