
చిక్కటి చీకటి రాత్రి
ప్రశాంతతను ఆశించి నిద్రకుపక్రమించిన కొలను
ఆ పక్కనే పెద్ద మర్రి చెట్టు
దానిని ఆశ్రయించిన ఎన్నో పక్షులు
అవి ఎప్పటినుంచి వేచి ఉన్నాయో
ఆ తరుణం కోసం.. ఎన్ని ఊసులో.. ఎన్ని గుసగుసలో..
గుండె లోతుల్లోనుంచి గుచ్చబడిన
బంధాలు తెగి జారిన ముత్యాల్లా.. సాగుతున్నాయి
ఆ ఊసులాపమన్నట్టు సున్నితంగా..
ఆ కొలను.. మర్రిచెట్టును అలల చేతులతో తడుతుంది..
ముల్లులా దాని మనసు గుచ్చేవి కొన్నైతే
తన నొచ్చులని పువ్వులా తడిమి
దానికి నచ్చేవి మరికొన్ని... ఐనా..
అలసిన కొలను ఆపమంటుంది..
తనకు శాంతి అవసరమంటుంది..
ఐనా.. అవి సాగుతూనేఉన్నాయి ...
అలసిన కొలను ఆపమంటుంది..
ReplyDeleteతనకు శాంతి అవసరమంటుంది..
Atreya gaaru, I madhya mI kavitalu chala miss ayyanu.. malli vacchaanamDoy.
baagundi saaru.
ఆగని కాలం అదుపుచేయలేం
ReplyDeleteవినని మనసు వూసులాపలేం
రేయి కలల వూయలాపదు
కాలాలు, వూసులు, కలలు అదుపుచేయలేం
కనుక ఓ కొలనమ్మా ఇక మము మన్నించేయ్..
బారారె గారు అదే అనుకున్నాను ఏమయ్యారా అని. హమ్మయ్య వచ్చేశారుగా .. ఆనందంగా ఉంది. మీకు కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteఉష గారు ఈ కవితకి శీర్షిక అలా పెట్టకపోతే (చెరువుగట్టు అనో కొలనుకధ అనో పెడితే) ఎలా ఉంటుందంటారు ? ఏమో ఈమద్య నాకవితలు ఇలా రెండు అర్ధాలతో రాస్తే నా మిత్రులకు కొంతమందికి అర్ధంకాలేదన్నారు. అందుకని ఇలా కవితకి, శీర్షిక పెట్టాను (నాకు కాస్త ఇబ్బంది ఐనా..)