Thursday, January 15, 2009

తనివి

తనివి తీరు సఖియా
నీ మనసు నిండు చెలియా
గత జన్మ బంధమీ అనురాగం
విడిపోని గంధమీ అభిమానం

ఉన్నది ఎడారి ఐనా గానీ
నీతో ఉంటే వసంత మేగా
నింగిన మబ్బులు నిండిన గానీ
నిండగు పున్నమి ముంగిలి లేదా ! తనివి..

వెచ్చని కౌగిలి కరిగిపోయినా
తరగని కాలము మనదరి లేదా
తీయని హృదయపు తేనెలుడిగినా
మధువులు ఊరే అధరము లేదా ! తనివి..

శృతి రాసిన "తనివి తీరలేదే" http://manaanubhoothulu.blogspot.com/2009/01/blog-post_15.html
కు నా స్పందన

7 comments:

 1. మీరింత తక్కువ సమయంలో అంత చక్కటి స్పందనలు ఎలా రాసేస్తున్నారండీ బాబూ..!
  నిజంగా చాలా బావుంది ఇది కూడా :)

  ReplyDelete
 2. అయ్య బాబోయ్ మీరు మనిషా కవితల కార్ఖానానా
  సవ్యసాచిలా మాటలు ఎడా పెడా వాడేస్తున్నారు
  భావాన్ని భాషలో కలగలిపి వడియాల్లా పెట్టేస్తున్నారు
  స్పందనల్లో ఎండేస్తున్నారు.
  i am amazed. keep going..

  ReplyDelete
 3. మీ తనివి ఎలా తీర్చాలో తెలియక ఇక మేం మేం కొట్టుకోవటమే మిగిలిందిక. :)

  ReplyDelete
 4. ఆత్రేయ గారూ !చాలా బాగా రాశారండీ .ఇంతకూ ఆ పాట ఏ సినిమా లోనిదో గుర్తు రావట్లేదు మీరైనా చెప్పండి .

  ReplyDelete
 5. పరిమళం గారూ ఈ పాట గూడుపుఠణి చిర్తం లోనిది

  ReplyDelete
 6. మధురవాణి గారు ముందుగా నా బ్లాగుకు స్వాగతం. నేను రాయటం ఏమిటండి బాబు. ఈ పిల్లలు గిల్లు తున్నారు నేను అరుస్తున్నాను అంతే. మీరు ఎలాగయినా మధురవాణి కదా, అన్నీ కవితల్లానే కనిపిస్తాయి. మళ్ళీరండి గీతాలతో స్వాగతం పలుకుతాము. ధన్యవాదాలు.

  అయ్యా అనానిమసూ, వడియాలు నచ్చినందుకు ధన్యవాదాలు. మా కార్ఖానాలో నా వడియాలే కాక ఇతర పిల్లకాయల మిరియాల అప్పడాలు, అరువుతెచ్చుకున్న పునుగుబజ్జీలు కూడ దొరుకుతాయి. మీకు ఆస్వాదించే సమయం ఉంటే. మళ్ళీరండి మంచి మసాలా మజీగతో తయారుగా ఉంటాము.

  ఉష, నేస్తం, పరిమళం, శృతి ఇక మీగురించి చెప్పేదేముంది. తోటి విద్వాంసులు. కచేరీకి అందరూ తయ్యారా !? ధన్యవాదాలు.

  ReplyDelete