Wednesday, September 17, 2008
గుర్తుకొస్తున్నాయి
తువ్వాయి వెనక పరుగులు
తూనీగ తోక దారాలు
పగిలిన బొంగరాలు
పట్టాలపై కోకు మూతలు
మామిడితోటల్లో దొంగతనాలు
మిద్దె మీదచేరి రాయబారాలు
బురద గుంటల్లో భరతనాట్యాలు
మురికి దుస్తుల వీపు డోలువాద్యాలు
పరీక్షలకు తోడిచ్చిన మడత చీటీలు
స్నేహంలో తీర్పిచ్చిన మడత పేచీలు
సాధించిన నూనుషో టిక్కెట్టు
తెలిసి నాన్నెట్టిన చీవాట్లు
మనసు మడతల్లో చూసేకొద్దీ
ఎన్ని రంగుల చిత్రాలో ఎన్ని ఆణిముత్యాలో
గుర్తుకొస్తున్నాయి !!
ఇక నేననుభవించలేనని అవి గేలిచేస్తున్నయి
నావయసు ఎంతో నాకు గుర్తు చేస్తున్నయి !!
గుర్తుకొస్తున్నయవి గేలిచేస్తున్నయి !
tuvvaayi venaka parugulu
tuuneega tOka daaraalu
pagilina bongaraalu
paTTaalapai kOku muutalu
maamiDitOTallO dongatanaalu
midde meedacEri raayabaaraalu
burada gunTallO bharatanaaTyaalu
muriki dustula veepu DOluvaadyaalu
pareekshalaku tODiccina maData ceeTeelu
snEhamlO teerpiccina maData pEceelu
saadhincina nuunushO TikkeTTu
telisi naanneTTina ceevaaTlu
manasu maDatallO cuusEkoddee
enni rangula citraalO enni aaNimutyaalO
gurtukostunnaayi !!
ika nEnanubhavincalEnani avi gElicEstunnayi
naavayasu entO naaku gurtu cEstunnayi !!
gurtukostunnayavi gElicEstunnayi !
Subscribe to:
Post Comments (Atom)
mee kavita chadivaka naku anipistondi....kaalam venakki parigedite entha bavundu ani...
ReplyDelete